Allu Aravind: బన్నీతో సినిమా అని అక్షయ్‌ అందుకే అన్నాడా!

  • June 3, 2022 / 04:20 PM IST

థింక్‌ బిగ్‌.. ప్లాన్‌ బిగ్‌.. రిసీవ్‌ బిగ్‌… తెలుగు సినిమా నిర్మాతల్లో ఇలాంటి ఆలోచన చేసే పెద్ద పెద్ద నిర్మాతల్లో అల్లు అరవింద్‌ ఒకరు. అందుకే ఆయన్ను అందరూ ఏస్‌ ప్రొడ్యూసర్‌ అని అంటారు. ఈ మధ్య కాలంలో అల్లు అరవింద్‌ సినిమాలు చేయడం తగ్గించారు. సమర్పకుడిగానే ఎక్కువ సినిమాలొస్తున్నాయి. అయితే ఆయన భారీ ఆలోచన ‘రామాయణం’ ఉందనుకోండి. ఆ పనులు కొనసాగుతున్నాయి. ఇది కాకుండా అల్లు అర్జున్‌ కోసం బాలీవుడ్‌లో ఓ సినిమా మెటీరియలైజ్‌ చేస్తున్నారు. దీనిపై ఇటీవల ఇంకాస్త క్లారిటీ వచ్చింది.

‘సమ్రాట్‌ పృథ్వీరాజ్‌’ సినిమా ప్రచారంలో భాగంగా ఇటీవల అక్షయ్‌ కుమార్‌ మాట్లాడుతూ ‘‘ఎలాంటి హద్దులూ లేకుండా ‘ఒకే దేశం ఒకే సినిమా’ అన్నట్లు ఉండాలి. భవిష్యత్తులో నేనూ అల్లు అర్జున్‌తో కలసి ఓ సినిమా చేయవచ్చు. అలా జరగాలని ఆశిద్దాం’’ అని మాట్లాడారు. ఏదో సరదాకి మాట్లాడాడు అని అనుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే అలా చెప్పాలంటే ఏదో ఒక సౌత్‌ హీరో పేరు చెప్పేయొచ్చు. అలా కాకుండా కచ్చితంగా అక్షయ్‌ ఏరి కోరి బన్నీ పేరే ఎందుకు చెప్పాడు అనేది ఇక్కడ విషయం.

ఆ మధ్య ‘జెర్సీ’ సినిమా ప్రచారంలో అల్లు అరవింద్‌ మాట్లాడుతూ.. అడగకుండానే ‘బాలీవుడ్‌లో ఓ సినిమా ప్లాన్‌ చేస్తున్నామని, దాని తర్వాత మాట్లాడతాను’ అని చెప్పారు. ఆయన చెప్పబోయింది అల్లు అర్జున్‌ సినిమా గురించే అని టాక్‌. అంతేకాదు ఈ సినిమా పని మీదే అల్లు శిరీష్‌ గత కొన్ని నెలలుగా ముంబయిలోనే ఉన్నాడని కూడా టాక్‌. ఆ సినిమాలో అక్షయ్‌ కుమార్‌, షాహిద్‌ కపూర్‌ లాంటి వాళ్లు ఉంటారని చెబుతున్నారు. ఒకవేళ ఇదే జరిగితే బన్నీ పాన్‌ ఇండియా సెకండ్‌ స్టెప్‌ మామూలుగా ఉండదు.

ఇదంతా ఓవైపు జరుగుతుంటే.. మరోవైపు అల్లు అర్జున్‌ ఆ మధ్య సంజయ్‌ లీలా భన్సాలీని వెళ్లి కలిసి వచ్చారు. ఎందుకొచ్చారు, ఏం మాట్లాడుకున్నారు అనేది తెలియదు కానీ, సినిమా గురించి అయి ఉంటుంది అంటున్నారు. ఈ మొత్తం కలిపితే భారీ కాంబినేషన్‌ అలియాస్‌ అల్లు అరవింద్‌ భారీ ప్లాన్‌ గ్రౌండ్‌ వర్క్‌ నడుస్తోంది అనిపిస్తోంది.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!/a>
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus