సినిమాల్లో హీరో అంటే ఆల్మోస్ట్ సూపర్ పవర్స్ కలిగిన వ్యక్తిగా కనిపించాలి. అలా అయితే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు అనేది పాత మాట. ఇప్పుడు ప్రేక్షకులు సినిమాని చూసే పద్ధతి మారింది. చిన్న సినిమా అయినా… పెద్ద సినిమా అయినా… వాళ్ళు వైవిధ్యం కోరుకుంటున్నారు. ఒకప్పుడు సినిమాల్లో హీరోకి ఏమైనా డిఫెక్ట్ ఉంటే జనాలు థియేటర్ కు వచ్చేవాళ్ళు కాదు. కానీ ఇప్పట్లో హీరోకి ఏమైనా డిఫెక్ట్ ఉంటే.. అది సినిమాని చూడడానికి జనాలు వెళ్ళేవారు కాదు. ఒకప్పటి సినిమాల్లో హీరో ఎంత మందిని కొడితే అంత గ్రేట్. కానీ ఇప్పుడు ఎంత పెద్ద సమస్యని హీరో సాల్వ్ చేస్తే అతను అంత గ్రేటు. అందులోనూ హీరోకి ఓ డిఫెక్ట్ ఉంటే ఇంకా ఇంట్రెస్ట్ కలుగుతుంది ప్రేక్షకులకి. అందుకే హీరోలు కూడా ఛాలెంజింగ్ రోల్స్ లో అంటించడానికి వెనుకాడడం లేదు. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ హీరోలు అలా ఛాలెంజింగ్ రోల్స్ లో నటించిన సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
1) మహేష్ బాబు – 1 నేనొక్కడినే:
ఈ సినిమాలో మహేష్ బాబు ఇంటిగ్రేషనల్ డిజార్డర్ అనే వ్యాధితో బాధపడుతూ ఉంటాడు. దాని వల్ల నిజానికి, అబద్దానికి అతను తేడా తెలుసుకోలేక కన్ఫ్యూజ్ అవుతుంటాడు. అంతేకాకుండా మెమొరీ లాస్ కూడా ఉంటుంది. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు. కానీ కొంతమందికి సినిమా నచ్చింది.
2) నాని – భలే భలే మగాడివోయ్:
ఈ సినిమాలో హీరో నానికి మతిమరుపు. ఊరికే డీవియేట్ అయిపోతూ ఉంటాడు. దాని వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొంటాడు. మారుతీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది.
3) శర్వానంద్ – మహానుభావుడు:
ఈ సినిమాలో హీరో శర్వానంద్ ఓసిడి తో బాధపడుతూ ఉంటాడు. దాని వల్ల ఇతని ప్రేమకథ కి ఎలాంటి సమస్య వచ్చింది అనే థీమ్ తో తెరకెక్కింది. ఈ చిత్రానికి కూడా మారుతీనే దర్శకత్వం వహించాడు.
4) ఎన్టీఆర్ – జై లవ కుశ:
బాబీ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ ప్లే చేశాడు. ఇందులో రావణ్ పాత్రకి నత్తి. ఆ లోపం వల్ల ఇతని జీవితం రకరకాల మలుపులు తీసుకుంటుంది.
5) రవితేజ – రాజా ది గ్రేట్:
ఈ మూవీలో రవితేజ అంధుడి పాత్రలో నటించాడు. ఎటువంటి సమస్య వచ్చినా దానిని మెదడుతో జయించాలి అనే పాత్రలో అతని నటన అందరినీ ఆకట్టుకుంటుంది. అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకుడు.
6) రాంచరణ్ – రంగస్థలం:
సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన సినిమా ఇది. ఈ మూవీలో చరణ్ వినికిడి సమస్యతో బాధపడుతూ ఉంటాడు.
7) కార్తికేయ – 90 ఎం ఎల్:
ఈ చిత్రంలో హీరో కార్తికేయ ‘అల్కా హాలిక్ సిండ్రోమ్’ అనే వ్యాధితో బాధపడుతూ ఉంటాడు. అందువల్ల అతను 90.ఎం.ఎల్ మద్యం తీసుకోవాలి.. ఆ వ్యాధి వల్ల అతని లవ్ స్టోరీకి ఎన్ని సమస్యలు వచ్చాయి అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. సినిమా మాత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేదు.
8) నితిన్ – మాస్ట్రో:
ఈ మూవీలో నితిన్ అంధుడిగా నటిస్తాడు. కానీ తర్వాత విలన్ తమన్నా వల్ల నిజంగానే చూపు కోల్పోతాడు. ఈ మూవీ ఓటిటిలో రిలీజ్ అయ్యి కొంతవరకు ప్రేక్షకుల్ని అలరించింది.మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకుడు.
9) వెంకటేష్ -ఎఫ్3:
ఈ మూవీలో వెంకటేష్ రే చీకటితో బాధపడుతూ ఉంటాడు. అందువల్ల సినిమాలో చాలా ఫన్ జెనరేట్ అయ్యింది. అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకుడు.
10) వరుణ్ తేజ్ – ఎఫ్ 3:
ఇదే మూవీలో వరుణ్ తేజ్ నత్తితో బాధపడుతూ ఉంటాడు. అతనికి మాట బ్రేక్ అయినప్పుడల్లా ఏదో ఒక హీరో స్టెప్పు వేస్తూ మరింత ఫన్ జెనరేట్ చేశాడు.