ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

  • June 1, 2022 / 05:34 PM IST

ఓ సినిమాకి నిర్మాత భారీ బడ్జెట్ పెడితే దాన్ని రికవరీ చేసుకోవడానికి ప్రమోషన్స్ అనేవి మొదలవుతాయి. ఫస్ట్ లుక్, గ్లింప్స్ దగ్గర నుండీ, టీజర్, పాటలు ఇవన్నీ బేస్ చేసుకుని ఆ సినిమాకు ఏర్పడేలా చేస్తాయి. సినిమాకి ఏర్పడ్డ హైప్ లేదా బజ్ అనే విషయాలను పరిగణలోకి తీసుకుని ఆ సినిమాలకి బిజినెస్ అనేది జరుగుతుంటుంది. దానినే ప్రీ రిలీజ్ బిజినెస్ అంటుంటారు. అది థియేట్రికల్ బిజినెస్ తో పాటు నాన్ థియేట్రికల్ రైట్స్, ఆడియో రైట్స్, డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, డబ్బింగ్ రైట్స్ ఇవన్నిటితో కలిపి ఉంటుంది. ఇదంతా కలిపి నిర్మాత పెట్టిన బడ్జెట్ కు ఎక్కువగా వస్తుందా? తక్కువగా వస్తుందా? అనేది సదరు హీరో మార్కెట్ అలాగే ఆ సినిమా దర్శకుడి పై ఆధారపడి ఉంటుంది. ఎక్కువ శాతం హీరో పైనే ఆధారపడి ఉంటుంది.

ఇదిలా ఉండగా.. టాలీవుడ్లో కొంతమంది హీరోల సినిమాలకి భారీ రేంజ్లో నాన్ థియేట్రికల్ బిజినెస్ జరుగుతుంది.నాన్ థియేట్రికల్ రైట్స్ లో డిజిటల్ రైట్స్, ఆడియో రైట్స్, డబ్బింగ్ రైట్స్.. వంటివి కలిపి కలిపి ఉంటాయి. నిర్మాత పెట్టిన దాంట్లో చాలా వరకు ఈ నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలోనే రికవరీ అయిపోతుండడం మనం చూస్తూనే వస్తున్నాం. ఆ హీరోలు ఎవరు? వాళ్ళ నాన్ థియేట్రికల్ రైట్స్ మార్కెట్ ఎంత వరకు ఉంది అనే విషయాలను ఓ లుక్కేద్దాం రండి :

1) ప్రభాస్ :

‘బాహుబలి'(సిరీస్) తర్వాత మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలకు ఏ రేంజ్లో డిమాండ్ ఏర్పడిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నాన్ థియేట్రికల్ రైట్స్ విషయంలో కూడా ప్రభాస్ సినిమాలు భారీగా కలెక్ట్ చేస్తున్నాయి. ‘సాహో’ చిత్రానికి రూ.135 కోట్ల వరకు నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ‘రాధే శ్యామ్’ కు కూడా రూ.100 కోట్ల వరకు నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. సో మొత్తానికి ప్రభాస్ సినిమాలకి రూ.100 కోట్ల నాన్ థియేట్రికల్ బిజినెస్ ఈజీగా జరుగుతుంది.

2) అల్లు అర్జున్ :

‘పుష్ప ది రైజ్’ కు ముందు వరకు అల్లు అర్జున్ సినిమాకి రూ.40 కోట్ల నుండీ రూ.50 కోట్ల వరకు నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగేది. కానీ ఇప్పుడు అది రూ.80 కోట్ల నుండీ రూ.100 కోట్ల వరకు చేరిందట. ‘పుష్ప ది రూల్’ కి అంత మొత్తం బిజినెస్ జరిగే అవకాశం ఉంది.

3) ఎన్టీఆర్ :

‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ఎన్టీఆర్ సినిమాలకు కూడా రూ.60 కోట్ల నాన్ థియేట్రికల్ బిజినెస్ జరుగుతుంది. కొరటాలతో చేయబోయే సినిమాకి అంత మొత్తం పలికిందని తెలుస్తుంది. ప్రశాంత్ నీల్ సినిమాకి ఇంకెంత పలుకుంటుందో చూడాలి..!

4) రాంచరణ్ :

‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత రాంచరణ్ చేయబోయే శంకర్ సినిమాకి రూ.60 కోట్ల వరకు నాన్ థియేట్రికల్ బిజినెస్ జరుగుతుంది.

5) మహేష్ బాబు :

‘సర్కారు వారి పాట’ చిత్రానికి రూ.50 కోట్ల పైనే నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. త్రివిక్రమ్ సినిమాకి ఇంకా ఎక్కువ జరిగే అవకాశం ఉంది.

6) పవన్ కళ్యాణ్ :

భీమ్లా నాయక్’ సినిమాకు రూ.50 కోట్ల వరకు నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఆ సినిమా రిలీజ్ కు ముందే చాలా వరకు రికవరీ అయ్యింది అంటే దీని వల్ల అని చెప్పాలి.

7) విజయ్ దేవరకొండ :

‘లైగర్’ చిత్రానికి గాను ఏకంగా రూ.40 కోట్ల నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది.

8) చిరంజీవి :

‘ఆచార్య’ చిత్రానికి రూ.35 కోట్ల వరకు నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అంతకు ముందు ‘సైరా’ కి అయితే రూ.60 కోట్ల వరకు నాన్ థియేట్రికల్ రైట్స్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది.

9) నాని :

నేచురల్ స్టార్ నాని చిత్రాలకి నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలోనే సగం పైనే బిజినెస్ రికవరీ అయిపోతూ ఉంటుంది. ‘అంటే సుందరానికి!’ చిత్రానికి రూ.30 కోట్ల వరకు నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు వినికిడి.

10) రవితేజ :

మాస్ మహారాజ్ రవితేజ చిత్రాలకి కూడా రూ.25 కోట్ల నుండీ రూ.30 కోట్ల వరకు నాన్ థియేట్రికల్ బిజినెస్ జరుగుతూ ఉంటుంది. ఇది చూపించే అతను ఎక్కువ పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు ఎప్పటి నుండో టాక్ నడుస్తుంది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus