వర్మ ఆడుతున్న వెధవ నాటకమిది : అల్లు అరవింద్

  • April 19, 2018 / 11:30 AM IST

నేను ఇండస్ట్రీకి వచ్చి 40 ఏళ్లవుతోంది. ఇండస్ట్రీ అంటే నాకు అమితమైన గౌరవం ఉంది. అయితే.. ఈమధ్య ఇండస్ట్రీలో జరుగుతున్న సంఘటనలు బాధాకరంగా ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు త్వరలోనే 50% అవుట్ సైడర్స్, 50% ఇన్సైడర్స్ తో ఒక కమిటీ కేవలం స్త్రీల రక్షణ కొరకు ప్రారంభించబోతోంది. ఆ కమిటీ ద్వారా ఏ దర్శకుడు, నిర్మాత తప్పు చేసినా వారి సభ్యత్వాన్ని తొలగించే స్థాయిలో కమిటీ చట్టాలు ఉండబోతున్నాయి. “రాంగోపాల్ వర్మ అనే అతను ఈ ఇండస్ట్రీలో పెరిగి, ఈ ఇండస్ట్రీలోనే గొప్ప సినిమా తీసి, ఆ సినిమా ద్వారా బాలీవుడ్ కి కూడా వెళ్ళి, ఒక తల్లిగా భావించాల్సిన ఈ తెలుగు చిత్రసీమకు ఎంత ద్రోహం చేస్తున్నాడో చెప్పడం కోసమే నేడు మీడియా ముందుకు రావడం జరిగింది”. బాహుబలి తీశామని గర్వపడుతున్న తరుణంలో ఇలాంటి సంఘటనలు జరుగడం చాలా దారుణం. “శ్రీరెడ్డితో నేనే ఆ బూతు మాటను అనిపించాను” అని తానే చెప్పించానని వర్మ రిలీజ్ చేసిన వీడియో చూశాను. నాకేం అర్ధం కాలేదు, అయితే.. శ్రీరెడ్డి “వర్మ నాతో ఇలా చెప్పించాడు” అనే విషయాన్ని మీడియాకి చెప్పేయడంతో తానే ముందు స్వచ్ఛందంగా వచ్చానని చెప్పుకోవడానికి ఆడిన వెధవ నాటకమది.

అసలు శ్రీరెడ్డికి సురేష్ కుటుంబం నుంచి 5 కోట్లు ఇప్పిస్తానని వర్మ చెప్పినవన్నీ అబద్ధాలే. నేను స్వయంగా సురేష్ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసుకున్నాను. వర్మకున్నంత నీచమైన బుద్ధి, వెధవ తెలివితేటలు మాకు లేవు. మెగా కుటుంబం అంటే ఎంత కోపం లేకపోతే.. సురేష్ కుటుంబాన్ని రక్షించాలనే కబుర్లు చెబుతూ పవన్ కళ్యాణ్ ను డీగ్రేడ్ చేయాలని చూడడం అనేది సిగ్గుపడాల్సిన విషయం. వర్మ ఈ విషయమై తప్పకుండా అనుభవిస్తాడు.

పి.ఆర్.పి విషయంలో కూడా ఇలాంటి కుట్రలు చాలా జరిగాయి. పవన్ కళ్యాణ్ విషయంలోనూ ఆలాంటివే జరుగుతున్నాయి. అవి తట్టుకోలేకనే నేను ఈరోజు మీడియాకి వచ్చాను. ఇక వర్మని పవన్ కళ్యాణ్ లేదా అతని అభిమానులు ఏం చేస్తారనేది వారి విజ్నతకే వదిలేస్తున్నాను.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus