ఈ మధ్యకాలంలో సినీ సెలబ్రిటీలు అందరూ సీక్రెట్ మ్యారేజ్ లు… ప్రైవేట్ మ్యారేజ్ లు చేసుకోవడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎక్కువ హడావిడి లేకుండా కొద్దిపాటి బంధువులు.. సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకుంటే సరిపోతుంది అని వారు ఫిక్సవుతున్నారు. అయితే అలా వివాహం చేసుకున్నప్పటికీ.. తరువాత పెద్ద రెసెప్షన్ ఏర్పాటు చేసుకుని అందరినీ ఆహ్వానించేవారు కూడా ఉన్నారు. అయితే ఫామ్లో ఉన్న వారే అలా.. రిసెప్షన్ లు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఫేడౌట్ అయిపోయిన మాత్రం అందుకు ఇంట్రెస్ట్ చూపించరు. ఇదిలా ఉండగా.. ఇటీవల అల్లు అర్జున్ హీరోయిన్ సీక్రెట్ గా వివాహం చేసుకోవడం పెద్ద చర్చనీయాంశం అయ్యింది.
‘పరుగు’ చిత్రంలో హీరోయిన్ గా నటించిన షీలా కౌర్ అందరికీ గుర్తుండే ఉంటుంది.నిజానికి ఈమె నవదీప్ హీరోగా తెరకెక్కిన ‘సీతాకోక చిలుక’ చిత్రంతోనే హీరోయిన్ గా పరిచయం అయినప్పటికీ.. అల్లు అర్జున్ ‘పరుగు’ చిత్రంతోనే బాగా క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ చిత్రంలో లంగా.. వోణి వేసుకుని.. ఎంతో అమాయకంగా ఉండే ఈ బ్యూటీ.. ఆ తరువాత ఎన్టీఆర్ తో ‘అదుర్స్’ .. రామ్ తో ‘మస్కా’ వంటి హిట్ చిత్రాల్లో నటించింది. కానీ ఆ చిత్రాల్లో ఈమె సెకండ్ హీరోయిన్ గా నటించడం వల్లో ఏమో కానీ తరువాత ఎక్కువ ఆఫర్ లను దక్కించుకోలేకపోయింది. ఈమె చివరిగా నటించిన చిత్రం బాలకృష్ణ ‘పరమ వీర చక్ర’. ఆ చిత్రం డిజాస్టర్ కావడంతో ఈమెను పట్టించుకునే దర్సకనిర్మాతలే కరువయ్యారు. దీంతో కన్నడ ఇండస్ట్రీకి చెక్కేసింది. ఇక తాజాగా ఈమె ప్రముఖ వ్యాపారవేత్త సంతోష్ రెడ్డిని సీక్రెట్ గా వివాహం చేసుకుంది. అలా అని ప్రేమ వివాహం కాదు.. పెద్దలు కుదిర్చిన పెళ్లేనట. బుధవారం రోజు చెన్నైలో కుటుంబ సభ్యులు మరియు కొంతమంది సన్నిహితుల సమక్షంలో ఈ వివాహం జరిగినట్టు తెలుస్తుంది.
Most Recommended Video
యురేక సినిమా రివ్యూ & రేటింగ్!
మధ సినిమా రివ్యూ & రేటింగ్!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు..!