Allu Arjun, Balakrishna: సినిమాలతో సంబంధం లేకుండా ఈ హీరోలకు క్రేజ్ పెరుగుతోందా?

  • January 9, 2023 / 01:31 PM IST

నందమూరి హీరో బాలకృష్ణ 2021 సంవత్సరం డిసెంబర్ నెలలో అఖండ సినిమాతో సక్సెస్ సాధించగా అదే నెలలో పుష్ప ది రైజ్ సినిమాతో అల్లు అర్జున్ సక్సెస్ ను సొంతం చేసుకున్నారు. అయితే 2022 సంవత్సరంలో ఈ ఇద్దరు హీరోల సినిమాలేవీ రిలీజ్ కాలేదు. అయినప్పటికీ ఈ ఇద్దరు హీరోలకు క్రేజ్ ఊహించని స్థాయిలో పెరిగిందే తప్ప అణువంతైనా తగ్గలేదని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. సినిమాలతో సంబంధం లేకుండా ఈ ఇద్దరు హీరోలకు క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం.

ఈ విషయంలో ఈ ఇద్దరు హీరోలు సేమ్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పుష్ప ది రైజ్ సినిమాతో బన్నీకి పాన్ ఇండియా హీరోగా గుర్తింపు దక్కగా హిందీలో ఈ నెల 20వ తేదీన రిలీజ్ కానున్న అఖండ సినిమాతో బాలకృష్ణకు కూడా హిందీలో మంచి గుర్తింపు దక్కడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఆహా ఓటీటీ సక్సెస్ లో కూడా ఈ ఇద్దరు హీరోల పాత్ర ఉందనే సంగతి తెలిసిందే. బాలయ్య, బన్నీ కాంబినేషన్ లో సినిమా వస్తే బాగుంటుందని కొంతమంది ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

బాలయ్య ఈ ఏడాది వీరసింహారెడ్డితో ప్రేక్షకుల ముందుకు రానుండగా బన్నీ పుష్ప2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ రెండు సినిమాలు కూడా కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరో మూడు రోజుల్లో వీరసింహారెడ్డి మూవీ థియేటర్లలో విడుదలవుతోంది. బన్నీ ప్రస్తుతం 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటుండగా బాలయ్య 20 కోట్ల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

బాలయ్య అనిల్ రావిపూడి కాంబో మూవీ షూట్ శరవేగంగా జరుగుతోంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయని తెలుస్తోంది. కెరీర్ విషయంలో బాలయ్య, బన్నీ ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus