ఎస్.ఎస్. రాజమౌళి ఈ పేరు ఇప్పుడు ఇండియన్ సినిమా కేర్ అఫ్ అడ్రస్ గ మారింది. బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ సినిమాలతో అయన రేంజ్ మారింది. మొన్నటి వరకు ఇండియన్, జపాన్ వరకే పరిమితం అయినా రాజమౌళి అనే బ్రాండ్ ఇప్పుడు హాలీవుడ్ వరకు వెళ్ళింది.
NYFCC (న్యూ యార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్) వారు బెస్ట్ డైరెక్టర్ అవార్డు తో మన రాజమౌళి ని సత్కరించారు. NYFCC నుండి అవార్డు గెలిచినా మొట్ట మొదటి భారతీయ దర్శకుడు మన ఎస్.ఎస్. రాజమౌళి గారే.
ఇలా తెలుగు సినిమాతో ఇంటర్నేషనల్ అవార్డ్స్ కొట్టడం SS రాజమౌళి కి కొత్తేమి కాదు. ఇది వరకు ఈగ, మగధీర, బాహుబలి సినిమాలకు రాజమౌళిని ఇంటర్నేషనల్ అవార్డ్స్ వెత్తుకుంటూ వచ్చాయి…ఆ అవార్డ్స్ ఏంటో అవి ఏ సినిమాలకి వచ్చాయో ఒకసారి చూసేద్దాం పదండి…
1. బెస్ట్ ఆసియన్ మూవీ ఈగ – న్యూచాటెల్ ఇంటర్నేషనల్ ఫెంటాస్టిక్ ఫిలిం ఫెస్టివల్
2. స్పెషల్ మేన్షన్ & హానిర్ ఫర్ ఈగ మూవీ – న్యూచాటెల్ ఇంటర్నేషనల్ ఫెంటాస్టిక్ ఫిలిం ఫెస్టివల్
3. బెస్ట్ పాపులర్ ఫిలిం ప్రొవైడింగ్ హోల్సం ఎంటర్టైన్మెంట్ బాహుబలి 2 – గోల్డెన్ లోటస్ అవార్డు
4. బెస్ట్ ఫీచర్ ఫిలిం బాహుబలి 1 – గోల్డెన్ లోటస్ అవార్డు
5. ఆర్.ఆర్.ఆర్ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం – సాటర్న్ అవార్డ్స్ 2022
6. ఆర్.ఆర్.ఆర్ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం – సన్సెట్ సర్కిల్ అవార్డ్స్ 2022
7. నర్రటివ్ ఆడియన్స్ అవార్డు ఫర్ ఆర్.ఆర్.ఆర్ – ఫిలడెల్ఫియా ఫిలిం ఫెస్టివల్
8. బెస్ట్ డైరెక్టర్ ఫర్ ఆర్.ఆర్.ఆర్ ఫ్రొం NYFCC (న్యూ యార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్)