2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

2020 లో కోవిడ్ ఎంట్రీ ఇచ్చినప్పుడు సినీ పరిశ్రమలో చాలా మంది సెలబ్రిటీలు మరణించారు. వారికి ఉన్న అనారోగ్య సమస్యలపై కోవిడ్ మరింత ప్రభావం చూపడంతో ప్రాణాలు విడిచారు. 2021 లో సెకండ్ వేవ్ ఎఫెక్ట్ కారణంగా కూడా ఎక్కువ మందే మరణించారు. ఇక 2022 లో కోవిడ్ తీవ్రత తగ్గిపోయింది కదా.. ఇంకేమి భయం లేదు అని అంతా ఊపిరి పీల్చుకుంటే 2022 లో కూడా చాలా మంది సినీ ప్రముఖులు మరణించారు. ఆ సెలబ్రిటీలు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1) రమేష్ బాబు :

సూపర్ స్టార్ కృష్ణ గారి పెద్దబ్బాయి, ప్రముఖ నటుడు, నిర్మాత, మహేష్ బాబు అన్నయ్య అయిన రమేష్ బాబు జనవరి 8న అనారోగ్య సమస్యలతో మరణించారు.

2) బప్పీ లహరి :

ప్రముఖ సంగీత దర్శకుడు బప్పీ లహరి అందరికీ సుపరిచితమే. ‘సింహాసనం’ ‘గ్యాంగ్ లీడర్’ ‘రౌడీ అల్లుడు’ వంటి హిట్ సినిమాలకు సంగీతం అందించిన ఈయన ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో అనారోగ్య సమస్యలతో మరణించాడు.

3) మన్నవ బాలయ్య :

ప్రముఖ టాలీవుడ్ నటుడు మన్నవ బాలయ్య అందరికీ సుపరిచితమే. అప్పట్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఈ ఏడాది ఏప్రిల్ లో ఈయన మరణించారు.

4) గురుస్వామి :

‘మహర్షి’ సినిమాలో మహేష్ బాబుకి వ్యవసాయం నేర్పించే తాత గారు అందరికీ గుర్తుండే ఉంటారు. ఈ ఏడాది సెప్టెంబర్లో ఈయన మరణించారు.




5) డి.ఎం.కె మురళి :

ప్రముఖ నటుడు సీనియర్ జర్నలిస్ట్ అయిన డి.ఎం.కె మురళి కూడా ఈ ఏడాది కన్నుమూశారు.




6) కృష్ణంరాజు :

రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు ఈ ఏడాది సెప్టెంబర్లో మరణించిన సంగతి తెలిసిందే. గతంలో ఈయన స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగారు.

7) ఇందిరాదేవి :

మహేష్ బాబు తల్లి, సూపర్ స్టార్ కృష్ణ గారి భార్య అయిన ఇందిరా దేవి గారు సెప్టెంబర్ లో మరణించడం జరిగింది.




8) కృష్ణ :

సూపర్ స్టార్ కృష్ణ గారు అనారోగ్య సమస్యలతో నవంబర్ నెలలో మరణించారు. మహేష్ బాబు కుటుంబంలో ఈయనతో కలుపుకుని మొత్తం 3 మంది మరణించారు. ఈ ఏడాది మహేష్ బాబుకు పెద్ద దెబ్బ తగిలిందనే చెప్పాలి.




9) కైకాల సత్యనారాయణ :

సీనియర్ స్టార్ నటులు కైకాల సత్యనారాయణ గారు ఈ ఏడాది, ఇదే నెలలో మరణించిన సంగతి తెలిసిందే.




10) చలపతిరావు :

మరో సీనియర్ స్టార్ విలక్షణ నటుడు చలపతిరావు కూడా ఈ ఏడాది, ఇదే నెలలో కన్నుమూశారు.




11) వల్లభనేని జనార్ధన్ :

చిరంజీవి నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో క్రుయాలిటీతో నిండిన పోలీస్ ఆఫీసర్ అందరికీ గుర్తుండే ఉంటారు. ఆయనే వల్లభనేని జనార్ధన్. ఈయన దర్శకుడిగా, నిర్మాతగా కూడా టాలీవుడ్ కు ఎన్నో సేవలు అందించారు. ఆయన కూడా ఈ ఏడాది, ఇదే నెలలో కన్నుమూశారు.

వీరితో పాటు మీనా భర్త, ఆర్.నారాయణ మూర్తి తల్లి, దర్శకుడు బాబీ తండ్రి.. ఇలా ఎంతో మంది సినీ కుటుంబాలకి చెందిన వ్యక్తులు కూడా మరణించడం జరిగింది.




Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus