స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినీ కెరీర్ లో సరైనోడు సినిమా ప్రత్యేకమనే సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి నెగిటివ్ రివ్యూలు వచ్చినా బాక్సాఫీస్ దగ్గర భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించి అల్లు అర్జున్ కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్లలో సరైనోడు ఒకటిగా నిలిచింది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన సరైనోడు సినిమాతో బన్నీ బోయపాటి శ్రీను కాంబినేషన్ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ అనిపించుకోగా ఈ కాంబినేషన్ లో మరో సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తెలుస్తున్న సమాచారం ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి బన్నీ బోయపాటి శ్రీను సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని సమాచారం. పుష్ప సినిమా తరువాత బన్నీ ఐకాన్ సినిమాలో నటించనున్నారు. శ్రీరామ్ వేణు ఇప్పటికే ఐకాన్ స్క్రిప్ట్ ను సిద్ధం చేయగా పుష్ప పార్ట్1 షూటింగ్ పూర్తైతే బన్నీ ఐకాన్ షూటింగ్ ను మొదలుపెట్టే అవకాశం ఉంది. వచ్చే ఏడాది సమ్మర్ నాటికి ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేయాలని బన్నీ భావిస్తున్నారు.
ఐకాన్ షూటింగ్ పూర్తైన తరువాత బన్నీ బోయపాటి శ్రీను కాంబినేషన్ మూవీ షూటింగ్ మొదలుకానుంది. ప్రస్తుతం అఖండ సినిమా పనులతో బిజీగా ఉన్న బోయపాటి శ్రీను ఈ సినిమా షూటింగ్ పూర్తైన తరువాత అల్లు అర్జున్ కోసం స్క్రిప్ట్ ను సిద్ధం చేయనున్నారని సమాచారం. ఒకవైపు బోయపాటి శ్రీను సినిమాలో మరోవైపు పుష్ప2 సినిమాలో అల్లు అర్జున్ పాల్గొంటారని తెలుస్తోంది. పుష్ప2 సినిమా 2023 సంవత్సరంలో రిలీజయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Most Recommended Video
ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!