Allu Arjun: ఆరు బయట పిల్లలతో సరదాగా గడుపుతున్న బన్నీ!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పుష్ప సినిమా ముందు వరకు సౌత్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో మరింత ఆదరణ సంపాదించుకొని ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్నారు. పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో మంచి హిట్ అవడంతో ప్రతి ఒక్కరు ఈ సినిమా సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ షూటింగ్ పనులలో అల్లు అర్జున్ ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే అల్లు అర్జున్ సినిమాల పరంగా ఎంత బిజీగా ఉంటారో ఆయనకు ఏమాత్రం సమయం దొరికిన తన ఫ్యామిలీతో సరదాగా గడపడానికి అంతే ఆసక్తి కనపరుస్తారు. కాస్త ఎక్కువ విరామం దొరికితే భార్య పిల్లలతో కలిసి పలు వెకేషన్స్ కి వెళుతూ ఉంటారు లేదా ఇంట్లోనే సరదాగా తన పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఉంటారు.

ఇలా అల్లు అర్జున్ (Allu Arjun) తన పిల్లలతో సరదాగా గడుపుతున్నటువంటి ఫోటోలు వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలోనే తాజాగా అల్లు అర్జున్ తన పిల్లలతో కలిసి ఆడుకుంటున్నటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో అల్లు అర్జున్ తన ఇంటి ఆవరణంలో నవారు మంచం వేసుకొని పిల్లలతో సరదాగా కడుపుతున్నారు.

ఇలా మంచంపై తన పిల్లలతో కలిసి పడుకున్న అల్లు అర్జున్ ఆకాశాన్ని చూస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలు చూసినటువంటి నెటిజెన్స్ పిల్లలను ఎప్పుడూ ఆ ఏసీ గదుల్లో బంధించకుండా ఇలాంటి వాతావరణంలోకి తీసుకురావడం చాలా మంచి పద్ధతి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus