Allu Arju: బన్నీ సుకుమార్ కు భారీ షాకిచ్చిన ఫ్యాన్!

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో ఆర్య, ఆర్య2 సినిమాల తర్వాత పుష్ప సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు రిజెక్ట్ చేసిన కథతో సుకుమార్ పుష్ప సినిమాను తెరకెక్కిస్తున్నారని బోగట్టా. పుష్ప పార్ట్1 ఈ ఏడాది డిసెంబర్ 17వ తేదీన రిలీజ్ కానుండగా పుష్ప పార్ట్2 షూటింగ్, రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే విడుదలైన పుష్ప ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేస్తోంది.

మాస్ ప్రేక్షకులను పుష్ప ట్రైలర్ ఆకట్టుకుంటుండగా కొంతమంది మాత్రం పుష్ప ట్రైలర్ గురించి పెదవి విరుస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ వీరాభిమాని ఒకరు చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. అల్లు శ్రుతి అనే ట్విట్టర్ ఖాతా నుంచి ఒక యువతి తాను ట్విట్టర్ కు గుడ్ బై చెబుతున్నానని పేర్కొన్నారు. పుష్ప మూవీ ఏదైనా తేడా కొడితే నా చావు చూస్తారు గాడ్ ప్రామిస్ మదర్ ప్రామిస్ అని అల్లు శ్రుతి ట్వీట్ లో చెప్పుకొచ్చారు.

ఇన్ని డేస్ మీకు చాలా రెస్పెక్ట్ ఇచ్చి ట్వీట్లు చేశానని పుష్ప మేకర్స్ గురించి శ్రుతి అన్నారు. ట్రైలర్ చూసి నా మనసు చచ్చిపోయిందని ఇంకా నా వల్ల కాదని శ్రుతి వెల్లడించారు. ఈ ట్వీట్ గురించి మేకర్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. అల్లు అర్జున్, సుకుమార్ షాకయ్యేలా ఈ ట్వీట్ ఉండటం గమనార్హం. అయితే ట్రైలర్ నచ్చకపోయినంత మాత్రాన ఇలా చనిపోతామని బెదిరించడం కరెక్ట్ కాదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. అల్లు శ్రుతి ట్విట్టర్ కు గుడ్ బై చెబుతూ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus