Allu Arjun: అవినాష్ కు మాస్ వార్నింగ్ ఇచ్చిన ఫ్యాన్స్.. ఫోటో డిలీట్ చేయాలంటూ?

జబర్దస్త్ కమెడియన్ గా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ముక్కు అవినాష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు పొందిన ఈయన ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమయ్యే కార్యక్రమాలలో పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఇలా బుల్లితెర పై పలు కార్యక్రమాల ద్వారా పెద్ద ఎత్తున సందడి చేస్తున్న అవినాష్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. అయితే తాజాగా ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక ఫోటో బన్నీ అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తుంది.

ఈ విధంగా బన్నీ (Allu Arjun) అభిమానులు ముక్కు అవినాష్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనని భారీగా ట్రోల్ చేయడమే కాకుండా తనకు మాస్ వార్నింగ్ ఇస్తున్నారు.ఈ విధంగా అల్లు అర్జున్ అభిమానులు అవినాష్ పై మండిపడటానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే.. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న పుష్ప 2 సినిమా నుంచి అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే.

ఈ పోస్టర్ లో అల్లు అర్జున్ అమ్మవారి ఉగ్రరూపంల ఉండటం అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇదే పోస్టర్ ను ముక్కు అవినాష్ అరకొర ఎడిటింగ్ చేసి ఓన్ మేడ్ ఫోటోని షేర్ చేస్తూ అల్లు అర్జున్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. దీంతో ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ ఫోటో చూసినటువంటి అల్లు అర్జున్ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

అల్లు అర్జున్ ఈ రూపంలో ఉంటే అచ్చం అమ్మవారిలా ఉన్నారు కానీ నువ్వు మాత్రం పక్కింటి మంగమ్మ లాగా ఉన్నావు. ఈ ఫోటోతో అభిమానులకు ఇరిటేట్ తెప్పించకు. వెంటనే ఈ ఫోటోని డిలీట్ చెయ్యి లేకపోతే నీకు పగులుద్ది అంటూ తనకు మాస్ వార్నింగ్ ఇస్తున్నారు. ఇలా అల్లు అర్జున్ అభిమానులు ముక్కు అవినాష్ కు వార్నింగ్ ఇవ్వడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ విషయంపై అవినాష్ ఏ విధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus