Allu Arjun, Buchi Babu: బుచ్చిబాబుకి పెద్ద రిలీఫ్… అల్లు అర్జున్ వల్లేనట..!

‘ఉప్పెన‌’ తో ఎవ్వరూ ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ కొట్టి… స్టార్ డైరెక్టర్లకి సైతం షాకిచ్చాడు బుచ్చిబాబు సానా. ఫిబ్రవరి వంటి అన్ సీజన్లో అదీ కొత్త హీరోతో ఆ రేంజ్ సక్సెస్ కొట్టడం అంటే మాటలు కాదు. ‘ఉప్పెన’ చూసిన వాళ్లంతా ఆ సినిమాని ఎవరో పెద్ద దర్శకుడు తీసాడు అనే ఫీలింగ్ ను కలిగించాడు. నిజానికి బుచ్చిబాబులో మాస్ యాంగిల్ చాలా ఉంది. కానీ దాన్ని అప్పటికి దాచేసి ఓ లవ్ స్టోరీ తీసాడు.

నెక్స్ట్ సినిమాని మాత్రం ఓ స్టార్ హీరోతో చెయ్యాలి అనుకున్నాడు. బుచ్చిబాబుతో సినిమా చేయడానికి ఎన్టీఆర్ రెడీగా ఉన్నాడు.’మైత్రి’ వాళ్ళే నిర్మించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.కాక‌పోతే… ఎన్టీఆర్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ‘ఆర్‌.ఆర్‌.ఆర్’ పూర్తయిన వెంటనే కొరటాలతో ఓ సినిమా చేస్తాడు ఎన్టీఆర్. అటు తర్వాత అట్లీతో కూడా మూవీ చేయాలని భావించాడు. దాంతో బుచ్చిబాబు వెయిట్ చేయాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు అట్లీ … బన్నీతో సినిమా ఓకే చేయించుకున్నాడు.

అట్లీ.. బ‌న్నీ ప్రాజెక్టుతో బిజీ అయితే ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి ఇంకో సంవత్సరం పడుతుంది. కాబట్టి… బుచ్చిబాబుకి లైన్ క్లియ‌ర్ అయినట్టే.! ఎన్టీఆర్ కొర‌టాల తో సినిమా చేస్తూనే.. బుచ్చి బాబుతో కూడా సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి. ఎన్టీఆర్ కోసం ఓ స్పోర్ట్స్ డ్రామాని సిద్ధం చేసుకుని చాలా కాలంగా వెయిట్ చేస్తున్నాడు బుచ్చిబాబు.పాన్ ఇండియా మూవీగానే దీన్ని రూపొందించాలని ప్లాన్.ఎప్పుడో ‘నాన్నకు ప్రేమతో’ టైములోనే దీనికి సంబంధించిన లైన్ ఎన్టీఆర్ కు చెప్పి.. లాక్ చేసాడు.

మొత్తానికి బన్నీ వల్ల బుచ్చిబాబుకి పెద్ద రిలీఫ్ వచ్చింది. బుచ్చిబాబుతో సినిమా పూర్తయ్యాక ఎన్టీఆర్… ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తాడు.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus