Mahesh Babu: 20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

  • January 12, 2022 / 02:15 PM IST

మహేష్ బాబు హీరోగా జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘టక్కరి దొంగ’.నేటితో ఈ చిత్రం విడుదలై 20 ఏళ్ళు పూర్తికావస్తోంది. ఇది సూపర్ హిట్ అయిన చిత్రమేమి కాదు. డిజాస్టర్ మూవీనే. కానీ ఇది ఒక అండర్ రేటెడ్ మూవీ అనేది చాలా మంది అభిప్రాయం. ఈ మూవీ గురించి మనకి తెలియని కొన్ని విషయాల్ని ఇప్పుడు తెలుసుకుందాం పదండి :

1) అప్పటికి మహేష్ బాబు కెరీర్లో.. అలాగే టాలీవుడ్లో కూడా ఇదో భారీ బడ్జెట్ మూవీ.

2) కృష్ణ గారు ‘మోసగాళ్ళకు మోసగాడు’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయం చేసిన కౌబాయ్ సంస్కృతి ఆధారంగా రూపొందిన సినిమా ఇది.

3)ఆ తర్వాత అదే ఫార్మేట్ లో చిరంజీవి ‘కొదమసింహం’ వంటి సినిమాలు వచ్చాయి కానీ అవేవి సక్సెస్ అందుకోలేదు. అయితే కొన్నాళ్ల తర్వాత మహేష్ మళ్ళీ కౌబాయ్ తరహా నేపధ్యం ఉన్న సినిమాని చెయ్యాలని రెడీ అయ్యాడు.

4)మహేష్ సరసన బిపాసా బసు,లీసా రాయ్ వంటి బాలీవుడ్ భామలు హీరోయిన్లుగా నటించారు. వీళ్ళకి గట్టిగానే పారితోషికాలు ఇవ్వాల్సి వచ్చింది.

5) 2002 వ సంవత్సరం జనవరి 12న ఈ చిత్రం విడుదలయ్యింది. పోటీగా బాలకృష్ణ ‘సీమసింహం’, తరుణ్ ‘నువ్వు లేక నేను లేను’ సినిమాలు ఉన్నాయి. ఆ రెండు సినిమాలు సంక్రాంతిని బాగా క్యాష్ చేసుకున్నాయి.కానీ ‘టక్కరి దొంగ’ ని పట్టించుకున్న ప్రేక్షకులే లేరు.

6) ‘టక్కరి దొంగ’ సంక్రాంతికి రావాల్సిన సినిమా కాదు. వేరే టైములో విడుదలయ్యి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని ఆ టైములో ఇండస్ట్రీ పెద్దలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

7) చెప్పుకోడానికి ‘టక్కరి దొంగ’ లో చాలా హైలెట్స్ ఉన్నాయి. జయనన్ విన్సెన్ట్ అందించిన సినిమాటోగ్రఫీ హాలీవుడ్ సినిమాల్ని తలపించేలా ఉంటుంది.

8) మణిశర్మ సంగీతంలో రూపొందిన అన్ని పాటలు చాలా బాగుంటాయి. ‘టక్కరి దొంగ’ ఆల్బమ్ ను కూడా అండర్ రేటెడ్ అనే అనాలి.

9) బ్రిడ్జి సీక్వెన్స్ కానీ క్లైమాక్స్ లో నిధి అన్వేషణ ఎపిసోడ్ కానీ.. హీరో విలన్ ను కనిపెట్టే సన్నివేశం కానీ.. కమర్షియల్ ఫార్మేట్ కు కొత్త రూటు చూపించేలా ఉంటాయి.

10) నిజానికి ‘టక్కరి దొంగ’ ని స్టార్ ప్రొడ్యూసర్ కె.యస్.రామారావు గారు నిర్మించాల్సింది. కానీ కౌబాయ్ నేపథ్యం అనే సరికి ఆయన వెనకడుగు వేసారట.దాంతో ‘నిర్మాత పై భారం పెట్టడం ఎందుకులే’ అని భావించి దర్శకుడు జయంతే నిర్మాతగా మారి ఆ చిత్రాన్ని నిర్మించాలని డిసైడ్ అయ్యారట.

11) ‘టక్కరి దొంగ’ సినిమా చేసే ముందు దర్శకుడు జయంత్ కు కృష్ణగారు అడ్డు చెప్పారట. నీ స్టైల్ లో మహేష్ తో ఏదైనా ప్రేమ కథ చేయొచ్చు కదా డబ్బులు వస్తాయి. ఆ చిత్రాన్ని నిర్మించడానికి బడా నిర్మాతలు ముందుకు వస్తారు అని చెప్పారట. అంతేకాదు ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రం హిట్ అయినప్పటికీ నిర్మాతగా తనకి నష్టాలే మిగిలాయని తన అనుభవాన్ని చెప్పారట.అయినా సరే దర్శకుడు జయంత్ మాత్రం ‘టక్కరి దొంగ’ చెయ్యాలని బలంగా ఫిక్స్ అయ్యాడట.

12) అనుకున్నట్టే సినిమా చేశారు.. ప్లాప్ అయ్యింది.చాలా నష్టాలు వచ్చాయి. దాంతో మహేష్ అడ్వాన్స్ తిరిగిచ్చేయడం.. పారితోషికం కూడా వద్దని చెప్పి జయంత్ కు ధైర్యం చెప్పడం జరిగింది.

13) ‘టక్కరి దొంగ’ తెచ్చిన నష్టాల్ని … ‘ఈశ్వర్’ ‘లక్ష్మీ నరసింహా’ ‘శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్’ వంటి చిత్రాలతో తీర్చాడట దర్శకుడు జయంత్.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus