Allu Arjun, Allu Arha: హలోవీన్‌గా అర్హ అల్లరి వీడియో షేర్ చేసిన అల్లు స్నేహా..

  • November 2, 2022 / 09:44 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. కొద్దిరోజుల ముందు వరకు టాలీవుడ్, మాలీవుడ్‌కి పరిమితమయ్యాడు.. ‘పుష్ప’ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుని, పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ముఖ్యంగా నార్త్‌లో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ‘పుష్ప 2’ కోసం అక్కడి ఆడియన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.‘పుష్ప 2’ టీం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండడం వల్ల బన్నీకి బోల్డెంత టైమ్ దొరికింది.. షూటింగ్‌కి గ్యాప్ వస్తే ఆయన ఏం చేస్తాడో తెలుసు కదా.. ఫ్యామిలీతోనే టైం స్పెండ్ చేస్తుంటాడు.

పిల్లలు అర్హ, అయాన్‌లతో కలిసి, తాను కూడా పిల్లాడిలా మారిపోయి ఆటలాడుతుంటాడు. అర్హ చేసే అల్లరి, ముద్దు ముద్దు మాటలన్నిటినీ పిక్స్, వీడియోస్ తీసి అందరితో షేర్ చేస్తూ ఉంటాడు.. అలాగే తన గారాల పట్టి అర్హ ఏమడిగినా కాదనడాయన.. అర్హ నైట్ రైడ్‌కి తీసుకెళ్లమని అడగడంతో.. కూతురితో కలిసి రాత్రిపూట కారులో షికారు చేశాడు. రోడ్ పక్కన కార్ ఆపి వేడి వేడి దోశెలు కూడా లాగించారు. అడగ్గానే డాడీ నైట్ రైడ్‌కి తీసుకెళ్లడంతో అర్హ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి..

డిన్నర్ టైం అంటూ బన్నీ భార్య అల్లు స్నేహా రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఈ పిక్ షేర్ చేశారు. అయాన్ మిస్ అయ్యాడంటూ ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ప్రస్తుతం ప్రపచమంతా హలోవీన్ ఫీవర్ నడుస్తోంది.. ప్రతి సంవత్సరంలానే హలోవీన్‌ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారందరూ. అల్లు అర్హ కూడా హలోవీన్ గెటప్ వేసింది.. అలా మారిపోయి ఇల్లంతా తిరుగుతూ కనిపించిన వాళ్లని భయపెట్టాలని ట్రై చేసింది.

బుజ్జి బుజ్జి అడుగులతో ముద్దుగా ఉన్న ఈ వీడియో వైరల్ అవుతోంది.. ‘పుష్ప 2’ కోసం ఇటీవలే బన్నీ లుక్ టెస్ట్ జరిగింది.. పుష్పరాజ్ గా సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడని టాక్. పార్ట్ వన్‌కి మించి ‘పుష్ప – ది రూల్’ ఉండబోతుందని, నవంబర్ 7 నుండి షూటింగ్ స్టార్ట్ కానుందని సమాచారం..

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus