పాన్ ఇండియా కాన్సెప్ట్ అనేది వచ్చినప్పటి నుండి సినిమాల బడ్జెట్ కూడా పెరుగుతూ వస్తోంది. మిడ్ రేంజ్ హీరోలు కూడా తమ మార్కెట్ కు మించి బడ్జెట్ తో సినిమాలు చేస్తున్నారు. అయితే ఎక్కువ బడ్జెట్ పెట్టినంత మాత్రాన సినిమా హిట్ అవుతుంది అన్న గ్యారెంటీ లేదు. బడ్జెట్ ఎక్కువవ్వడం వలన చాలా సినిమాలు కాస్ట్ ఫెయిల్యూర్ అవ్వడం, నిర్మాతలకు, బయ్యర్స్ కు భారీ నష్టాలను మిగల్చడం మనం చూస్తూనే ఉన్నాం.కంటెంట్ డిమాండ్ చేస్తే ఎంత బడ్జెట్ పెట్టినా ఇబ్బంది ఉండదు. హై బడ్జెట్ అనేది రిస్క్ కాబట్టి.. పాన్ ఇండియా లెవెల్లో సినిమాని రూపొందించాల్సిన అవసరం పడుతుంది. ఇది ఎన్నాళ్ళు కొనసాగుతుంది అంటే.. ప్రస్తుతానికి ఎవ్వరి దగ్గర సమాధానం లేదు. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. ఇప్పుడు ఇండియన్ సినిమాల్లో భారీ బడ్జెట్ పెట్టిన సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
1) ఆర్.ఆర్.ఆర్ :
రాజమౌళి దర్శకత్వంలో ‘బాహుబలి’ తర్వాత అంతకు మించిన హైప్ మరియు బడ్జెట్ తో రూపొందిన చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. రాంచరణ్- ఎన్టీఆర్ లు హీరోలుగా నటించిన ఈ చిత్రానికి రూ.550 కోట్ల భారీ బడ్జెట్ పెట్టారు.
2)2.o :
రజినీకాంత్ – శంకర్ కాంబినేషన్లో రూపొందిన ఈ మూవీ రూ.540 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందింది.
3) బ్రహ్మాస్త్ర :
రణ్ బీర్ కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఈ చిత్రం రూ.410 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందింది.
4) సాహో :
ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ రూ.350 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందింది.
5) రాధే శ్యామ్ :
ప్రభాస్ హీరోగా రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ రూ.300 కోట్ల బడ్జెట్ తో రూపొందింది.
6) బాహుబలి 2 (‘బాహుబలి ది కన్క్లూజన్) :
ప్రభాస్ – రాజమౌళి కాంబినేషన్లో రూపొందిన ఈ మూవీ రూ.250 కోట్ల బడ్జెట్ తో రూపొందింది.
7) పొన్నియన్ సెల్వన్ -1(పీఎస్ -1):
మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ రూ.250 కోట్ల బడ్జెట్ తో రూపొందింది. పార్ట్ 2ని కూడా రూ.250 కోట్ల బడ్జెట్ తోనే రూపొందినట్టు సమాచారం.
8) సైరా నరసింహరెడ్డి :
మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ రూ.230 కోట్ల బడ్జెట్ తో రూపొందింది.
9) 83 :
రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ మూవీ కపిల్ దేవ్ జీవిత కథతో రూపొందింది. ఈ మూవీ రూ.225 కోట్ల బడ్జెట్ తో రూపొందింది.
10) థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ :
ఆమిర్ ఖాన్ హీరోగా కత్రినా కైఫ్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ చిత్రం రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందింది.
ఇవి మాత్రమే కాదు ‘పుష్ప'(‘పుష్ప ది రైజ్’) , ‘జీరో’ వంటి చిత్రాలు కూడా రూ.200 కోట్ల బడ్జెట్ తో రూపొందాయి. ఇప్పుడు సెట్స్ పై ఉన్న రాంచరణ్- శంకర్ ల మూవీ, ప్రభాస్ నటిస్తున్న ‘ఆదిపురుష్’, ‘సలార్’, ‘ప్రాజెక్టు కె’ వంటి చిత్రాలు కూడా రూ.250 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతున్నాయి.