చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!

2022 లో సినిమాల ఫలితాలు అంటే హిట్టు, ప్లాప్ అని నిర్దేశించే లెక్కలు చాలా మారిపోయాయి. సినిమా ఓ మాదిరిగా ఉంటే జనాలు చూడటం లేదు అని అంతా అంటున్నారు. నిజానికి సినిమా ప్రమోషనల్ కంటెంట్ తో బాగా అట్రాక్ట్ చేసి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే జనాలు థియేటర్లకు వస్తున్నారు అనేది నిజం. ఫైనల్ గా సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవాలి అది ముఖ్యం. లేదంటే ఈవెనింగ్ షోలకే థియేటర్లు ఖాళీ అయిపోతున్న పరిస్థితి. అందుకే 2022 లో హీరోల ట్రాక్ రికార్డ్ కూడా మారిపోయింది. కొంతమంది హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ స్వింగ్ లో ఉంటే మరికొంత మంది మాత్రం వరుస ప్లాపులతో సతమతమవుతున్నారు. మంచి కంబ్యాక్ కోసం ఎదురుచూస్తున్న ఆ హీరోలు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1) చిరంజీవి :

‘సైరా’ ‘గాడ్ ఫాదర్’ వంటి చిత్రాలు పర్వాలేదు అనిపించినా ‘ఆచార్య’ ఫలితాన్ని మాత్రం మరిపించలేకపోతున్నాయి. చిరు స్థాయి బ్లాక్ బస్టర్ ఒకటి అభిమానులకు కావాలి. ‘వాల్తేరు వీరయ్య’ ‘భోళా శంకర్’ వంటి చిత్రాల్లో ఏది పెద్ద హిట్ అయ్యి చిరుకి స్ట్రాంగ్ కం బ్యాక్ అందిస్తుందో చూడాలి.

2) రవితేజ :

4 ప్లాపుల తర్వాత ‘క్రాక్’ తో సక్సెస్ అందుకున్నాడు అనుకునేలోపే ‘ఖిలాడి’ ‘రామారావు ఆన్ డ్యూటీ’ వంటి డిజాస్టర్లు ఇచ్చాడు రవితేజ. ‘ధమాకా’ ‘రావణాసుర’ ‘టైగర్ నాగేశ్వరరావు’ వంటి చిత్రాల్లో ఏదో ఒక చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుని ఇతను ఫామ్లోకి రావాలి.

3) నాగార్జున :

‘బంగార్రాజు’ హిట్ అయినా అది పూర్తిగా నాగార్జున ఇమేజ్ పై ఆడిన సినిమా కాదు. ఆది ఆడింది అంటే చాలా ఫ్యాక్టర్స్ వర్కౌట్ అయ్యాయి. ‘వైల్డ్ డాగ్’ ‘ఘోస్ట్’ వంటి చిత్రాలను మరిపించేలా నాగ్ ఓ సాలిడ్ హిట్ కొట్టాల్సిన సమయం ఇది.

4) విజయ్ దేవరకొండ :

‘డియర్ కామ్రేడ్’ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ‘లైగర్’ ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టు డిజాస్టర్లు అయ్యాయి. విజయ్ కూడా ఓ సాలిడ్ హిట్టు కొట్టాలి.

5) నాని :

‘అంటే సుందరానికి’ మంచి సినిమా అనిపించుకుంది కానీ మంచి వసూళ్లు సాధించలేదు. కాబట్టి నాని కూడా ఓ సాలిడ్ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇవ్వాలి.

6) ప్రభాస్ :

‘సాహో’ ‘రాధే శ్యామ్’ ల రిజల్ట్స్ అభిమానులను నిద్రలేకుండా చేస్తున్నాయి. అర్జెంటుగా ఓ హిట్టు కొట్టాలి డార్లింగ్.

7) నాగ చైతన్య :

‘థాంక్యూ’ తో పెద్ద డిజాస్టర్ అందుకున్నాడు. దానిని మరిపించేలా ఓ హిట్టు కొట్టాలి.

8) రానా :

హిట్టు కొట్టి చాలా రోజులైంది రానా. ‘విరాట పర్వం’ ‘అరణ్య’ ల రిజల్ట్స్ ను మరిపించేలా ఓ భారీ హిట్టు కొట్టాలి.

9) వైష్ణవ్ తేజ్ :

‘ఉప్పెన’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ‘కొండపొలం’ ‘రంగ రంగ వైభవంగా’ సినిమాలతో రెండు డిజాస్టర్లు మూటగట్టుకున్నాడు. ఇతను కూడా ఓ సాలిడ్ హిట్టు కొట్టి ఫామ్లోకి రావాలి.

10) సాయి తేజ్ :

‘రిపబ్లిక్’ రిజల్ట్ చాలా డిజప్పాయింట్ చేసింది. తేజుకి కూడా అర్జెంట్ గా ఓ సాలిడ్ హిట్టు కావాలి.

వీళ్ళు మాత్రమే కాదు సుధీర్ బాబు, శిరీష్, ఆర్.ఎక్స్.100 కార్తికేయ నాగ శౌర్య, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, శ్రీ విష్ణు వంటి హీరోలు కూడా హిట్టు మొహం చూసి చాలా రోజులైంది. వీళ్ళకి హిట్లు ఎప్పుడు దక్కుతాయో చూడాలి.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus