‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!

టాలీవుడ్లో సీక్వెల్స్ తీయడానికి దర్శక నిర్మాతలు బాగా భయపడేవారు. బాలీవుడ్ సక్సెస్ అయిన ఈ ఫార్ములా టాలీవుడ్లో అంతగా సక్సెస్ కాలేదు అని వారి నమ్మకం. గతంలో ‘మని’ సూపర్ హిట్ అయితే ‘మనీ మనీ’ ప్లాప్ అయ్యింది. ‘ఆర్య’ హిట్ అయితే ‘ఆర్య 2’ నిరాశపరిచింది. ‘శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్’ సక్సెస్ అయితే ‘శంకర్ దాదా జిందాబాద్’ ప్లాప్ అయ్యింది. ‘గబ్బర్ సింగ్’ ఇచ్చిన జోష్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఇవ్వలేదు. అందుకే సీక్వెల్స్ అంటే మన వాళ్ళకి భయం.

అయితే ‘బాహుబలి 2’ ‘బంగార్రాజు’ ‘కార్తికేయ2’ ‘ఎఫ్3’ వంటి సీక్వెల్స్ సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు సీక్వెల్స్ వైపు మక్కువ చూపుతున్నారు టాలీవుడ్ మేకర్స్. మరీ ముఖ్యంగా 2023 లో కొన్ని సీక్వెల్స్ సందడి చేయనున్నాయి. తెలుగు సినిమాలనే కాదు, తమిళంలో, హిందీలో రూపొంది తెలుగులో హిట్ అయిన సినిమాల సీక్వెల్స్ కూడా 2023 లో సందడి చేయనున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

1) పుష్ప 2(పుష్ప ది రూల్ ) :

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన ‘పుష్ప'(పుష్ప ది రైజ్) చిత్రం సూపర్ సక్సెస్ అందుకుంది. దీంతో ‘పుష్ప 2’ పై కూడా అంచనాలు పెరిగాయి. 2023 లో ఈ మూవీ రిలీజ్ కానుంది.

2) డీజే టిల్లు 2 :

2022 ఆరంభంలో వచ్చిన ‘డీజే టిల్లు’ సక్సెస్ అందుకుంది. దీంతో డీజే టిల్లు స్క్వేర్ పేరుతో సీక్వెల్ రూపొందనుంది.2023 లోనే ఈ మూవీ రిలీజ్ కానుంది.

3) ఎఫ్ 4 :

‘ఎఫ్ 2’ ‘ఎఫ్ 3’ ల తర్వాత ‘ఎఫ్ 4’ కూడా రానుంది అని అనౌన్స్ చేశారు.2023 లోనే ఈ మూవీ రిలీజ్ కానుంది అని టాక్.

4) బింబిసార 2 :

కళ్యాణ్ రామ్ హీరోగా మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో వచ్చిన ‘బింబిసార’ డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీకి సీక్వెల్ గా ‘బింబిసార 2’ కూడా రానుంది.2023 లోనే ఆ మూవీ రిలీజ్ అవుతుంది అని టాక్.

5) రాక్షసుడు 2 :

తమిళ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘రాట్ససన్’ కు రీమేక్ గా తెరకెక్కిన ‘రాక్షసుడు’ మూవీ సక్సెస్ అందుకుంది. దీంతో దీనికి సీక్వెల్ కూడా రూపొందనుంది అని అనౌన్స్మెంట్ వచ్చింది. 2023 లోనే ఆ మూవీ రిలీజ్ కానుంది అని టాక్.

6) ‘గూఢచారి 2’ :

2018 లో అడివి శేష్ హీరోగా వచ్చిన ‘గూఢచారి’ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. దీనికి సీక్వెల్ గా రూపొందుతున్న ‘గూఢచారి 2’ 2023 లో రిలీజ్ కానుంది.

7) పొన్నియన్ సెల్వన్ 2 :

మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ అయిన ‘పొన్నియన్ సెల్వన్ -1 ‘ సూపర్ సక్సెస్ అందుకుంది. దీనికి సీక్వెల్ కూడా రానున్న సంగతి తెలిసిందే.2023 లో ఆ సీక్వెల్ రిలీజ్ కానుంది.

8) బ్రహ్మాస్త్రం 2 :

పార్ట్ 1 ‘బ్రహ్మాస్త్రం మొదటి భాగం : శివ’ పేరుతో రిలీజ్ అయ్యింది. తెలుగులో అయితే ఈ మూవీ సక్సెస్ అందుకుంది. హిందీలో యావరేజ్ రిజల్ట్ ను అందుకుంది. ‘పార్ట్ 2’ 2023 లో రాబోతుంది అని అనౌన్స్ చేశారు. చూడాలి మరి..!

9) డిటెక్టివ్ 2 :

 

‘డిటెక్టివ్’ సినిమా తెలుగులో కూడా సూపర్ సక్సెస్ అందుకుంది. దీనికి సీక్వెల్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. 2023 లోనే ఈ మూవీ రిలీజ్ కానుంది.

10) ‘లూసిఫర్ 2’ :

మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపొందిన ‘లూసిఫర్’ తెలుగులో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ‘లూసిఫర్ 2’ కూడా రూపొందుతుంది. 2023 లో ఈ మూవీ మలయాళంతో పాటు తెలుగులో కూడా ఏకకాలంలో రిలీజ్ కానుంది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus