హిందీ ఎంట్రీ కోసం కథలు సిద్ధం చేయమని చెప్పేశాడట

  • January 27, 2020 / 03:29 PM IST

ఒక్క మహేష్ బాబు తప్ప ప్రెజంట్ జనరేషన్ స్టార్స్ అందరూ బాలీవుడ్ లోనూ తమ సత్తా చాటుకొనేందుకు ఎప్పటికప్పుడు రెడీ అవుతూనే ఉన్నారు. మహేష్ బాబు మాత్రం చాలా సింపుల్ గా “నాకు బాలీవుడ్ మీద ఇంట్రెస్ట్ లేదు.. హ్యాపీగా తెలుగు సినిమాలు చేసుకుంటాను” అని నిక్కచ్చిగా చెప్పేస్తాడు. ఆయన కంఫర్ట్ జోన్ అది. సో, దాని గురించి కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. అయితే.. రామ్ చరణ్ ఆల్రెడీ బాలీవుడ్ ఎంట్రీ కోసం ప్రయత్నించి చేతులు కాల్చుకున్న విషయం ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు.

ఇప్పుడు అల్లు అర్జున్ తన బాలీవుడ్ డెబ్యు కోసం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. యాక్షన్, రొమాన్స్ లాంటి జోనర్స్ వంటివి కాకుండా హార్డ్ హిట్టింగ్ సినిమాలైన “గల్లీ బాయ్” లేదా “భాగ్ మిల్కా భాగ్” లాంటి సినిమాతో హిందీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వాలని ఉందని చెప్పుకొచ్చాడు బన్నీ. “గజినీ”తో బాలీవుడ్ కి మొట్టమొదటి 100 కోట్ల సినిమా ఇచ్చిన గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే బన్నీ తన బాలీవుడ్ డెబ్యు చేస్తాడేమో మరి. ఇకపోతే.. బన్నీ రిక్వైర్మెంట్ మేరకు ఆ తరహా కథలతో బాలీవుడ్ డైరెక్టర్స్ ఎవరైనా బన్నీని అప్రోచ్ అవుతారో లేదో కూడా చూడాలి.

డిస్కో రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus