Allu Arjun: ‘ఐకాన్’ మూవీకి కూడా అదే పద్ధతి ఫాలో అవుతాడట..!

  • June 28, 2021 / 05:26 PM IST

ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాలకు వారి సొంత సంస్థలో లేక తమ బంధువుల సంస్థలో నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. వీళ్ళు బడ్జెట్ ఎక్కువ పెట్టాల్సిన పని ఉండదు. హీరోగారి కాల్ షీట్లు ఇప్పిస్తే సరిపోతుంది.పైగా లాభాల్లో వాటా కూడా దక్కుతుంది. చిరు నటిస్తున్న ‘ఆచార్య’ సినిమాకి చరణ్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అలాగే కొరటాలతో.. ఎన్టీఆర్ చేస్తున్న సినిమాకి కళ్యాణ్ రామ్ సహా నిర్మాతగా వ్యవహరించనున్నాడు.

ఇక అల్లు అర్జున్ కూడా ‘అల వైకుంఠపురంలో’ సినిమాకి ‘గీతా ఆర్ట్స్’ సంస్థని ఇరికించాడు. ‘పుష్ప’ కి కూడా బన్నీ బంధువులు అయిన ‘ముత్తంశెట్టి మీడియా’ వారు సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక అల్లు అర్జున్ తర్వాతి చిత్రమైన ‘ఐకాన్’ కి కూడా ‘గీతా ఆర్ట్స్’ వారు నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరించే అవకాశం ఉందనేది తాజా సమాచారం.వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించబోతున్నాడు.

అయితే గీతా ఆర్ట్స్ కి నిర్మాణంలో భాగస్వామ్యం కల్పించాలని బన్నీ కోరడంతో ఈ ప్రాజెక్టు ఇన్నేళ్ళ పాటు డిలే అవుతూ వచ్చిందని ఇన్సైడ్ టాక్.గతంలో ఈ రెండు సంస్థలు కలిసి ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమాని నిర్మించాయి. అలాగే ప్రస్తుతం హిందీలో ‘జెర్సీ’ రీమేక్ ను నిర్మిస్తున్నారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ‘ఐకాన్’ ని కూడా నిర్మించబోతున్నారు అని తెలుస్తుంది.

Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus