Allu Arjun: ఆ ఘనత సాధించిన తొలి భారతీయ నటుడిగా బన్నీ.. ఏమైందంటే?

  • July 25, 2023 / 08:17 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన అల్లు అర్జున్ అల వైకుంఠపురములో, పుష్ప ది రైజ్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకున్నారనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం బన్నీ పుష్ప ది రూల్ సినిమాతో బిజీగా ఉండగా ఈ సినిమా ఏకంగా 1000 కోట్ల రూపాయల కలెక్షన్లు టార్గెట్ గా ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది. అయితే బన్నీ ఖాతాలో ఇప్పటికే ఎన్నో అరుదైన రికార్డులు చేరాయి.

సోషల్ మీడియాలో కూడా బన్నీ తగ్గేదేలే అనే విధంగా సత్తా చాటుతున్నారు. కొన్ని వారాల క్రితం జుకర్ బర్గ్ థ్రెడ్స్ యాప్ ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే థ్రెడ్స్ యాప్ లో జుకర్ బర్గ్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఈ యాప్ లో వన్ మిలియన్ ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్న నటుడిగా బన్నీ నిలిచారు. అల్లు అర్జున్ ఈ ఘనత సొంతం చేసుకోవడంతో అల్లు అర్జున్ అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు.

బన్నీ సోషల్ మీడియాలో కూడా చరిత్ర సృష్టించగలడని చరిత్ర తిరగరాయగలడని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పుష్ప2 సినిమాలో అద్భుతమైన డైలాగ్స్ ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే బన్నీ లీక్ చేసిన డైలాగ్ నెట్టింట తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ధోని భార్య సాక్షి బన్నీ గురించి చేసిన కామెంట్లు సైతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

స్టార్ హీరో అల్లు అర్జున్ కు నేను వీరాభిమానినని బన్నీ నటించిన ప్రతి సినిమాను తాను చూస్తానని యూట్యూబ్, ఓటీటీ ఇలా అన్నింట్లో బన్నీ సినిమాలను చూస్తానని ఆమె చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్ కు ఇతర భాషల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం వల్లే ఈ అరుదైన రికార్డ్ సొంతమైంది. రాబోయే రోజుల్లో బన్నీ థ్రెడ్స్ యాప్ మరిన్ని రికార్డులను క్రియేట్ చేయాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus