Srikanth: తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

సీనియర్ హీరో, విలన్ , క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన శ్రీకాంత్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నెగిటివ్ రోల్స్ తో కెరీర్ ను ప్రారంభించిన శ్రీకాంత్.. తర్వాత హీరోగా కూడా చేసి పలు హిట్లు అందుకున్నాడు. శ్రీకాంత్ వల్ల టాలీవుడ్లో పాపులర్ డైరెక్టర్స్ గా మారిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.ఫ్యామిలీ ఆడియన్స్ లో శ్రీకాంత్ కి స్పెషల్ క్రేజ్ ఉంది. ఇప్పటికీ గ్యాప్ లేకుండా సినిమాల్లో నటిస్తున్నారు శ్రీకాంత్.

ఎప్పుడూ ఖాళీగా ఉండకుండా ఏదో ఒక ప్రాజెక్ట్ తో బిజీగా ఉంటారు అనడంలో అతిశయోక్తి లేదు. ఏ ప్రాజెక్టు లేకపోతే వెబ్ సిరీస్ వంటి వాటిలో కూడా నటిస్తూ ఉంటారు. ‘అఖండ’ తో పవర్ ఫుల్ విలన్ గా మారిన శ్రీకాంత్.. మరోపక్క ‘వారసుడు’ వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూనే.. మరోపక్క పాన్ ఇండియా ప్రాజెక్టు గేమ్ చేంజర్ వంటి వాటిలో భాగం అవుతున్నాడు. ఇదిలా ఉండగా.. శ్రీకాంత్ ఫ్యామిలీ తాజాగా ఓ పెళ్లి వేడుకలో సందడి చేసింది.

(Srikanth) శ్రీకాంత్ .. ఊహ లతో పాటు ఆయన ముగ్గురు పిల్లలు రోషన్, మేదా, రోహన్ కు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రీకాంత్ తమ్ముడు అనిల్ కూతురి పెళ్లి వేడుకలో శ్రీకాంత్ ఫ్యామిలీ సందడి చేసినట్టు తెలుస్తోంది. అనిల్ కూడా హీరోగా ఓ సినిమా చేశాడు. నిర్మాతగా కూడా ఓ సినిమా చేశాడు.ఇక ఆయన కూతురి పెళ్లి వేడుకలో శ్రీకాంత్ ఫ్యామిలీ సందడి చేసిన ఫోటోలను మీరు కూడా ఆ లుక్కేయండి :

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus