Allu Arjun: అందరిని గర్వపడేలా చేశారు!: అల్లు అర్జున్

  • December 8, 2023 / 07:55 PM IST

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి చిత్రం యానిమల్ ఈ సినిమా డిసెంబర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమాలో రణబీర్ కపూర్ రష్మిక నటీనటులుగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా డిసెంబర్ ఒకటో తేదీ విడుదలైనటువంటి ఈ సినిమా ఇప్పటికే సుమారు 500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సంచలనం సృష్టించింది. ఇప్పటికే ఈ సినిమా చూసినటువంటి ఎంతోమంది సినీ సెలబ్రిటీలు సినిమాపై వారి అభిప్రాయాలను తెలియజేసిన సంగతి మనకు తెలిసిందే.

తాజాగా నటుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఇటీవల యానిమల్ సినిమా చూసినటువంటి అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ యానిమల్ చిత్ర బృందం పై ప్రశంసలు కురిపించారు. యానిమల్ సినిమా మైండ్ బ్లోయింగ్ అని బ్రిలియన్స్ అంటూ ఈయన చిత్ర బృందం పై ప్రశంశల వర్షం కురిపించారు. రణబీర్ భారతీయ సినిమాని సరికొత్త స్థాయికి తీసుకువెళ్లి అందరికోసం పూర్తిగా నిలిచారని తెలిపారు.

రష్మిక నటన బ్రిలియన్స్ అంటూ ఈయన ప్రతి ఒక్కరి నటన గురించి ప్రశంసల కురిపించారు అలాగే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గురించి కూడా ఈయన ప్రత్యేకంగా చెప్పుకువచ్చారు. దర్శకులు సందీప్ రెడ్డి మీరు అన్ని సినిమా పరిమితులను అధిగమించారు. మీరు మరోసారి అందరూ గర్వపడేలా చేశారు. భవిష్యత్తులో మీ సినిమాలు భారతీయ సినిమాల ముఖచిత్రాన్ని ఎలా మార్చబోతున్నాయో స్పష్టంగా కనిపిస్తుంది.

అలాగే ఈ సినిమా ఇండియన్ సినిమా క్లాసిక్ మూవీ లిస్టులోకి చేరుతుంది అంటూ ఈ సందర్భంగా (Allu Arjun) అల్లు అర్జున్ చేసినటువంటి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus