టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడు. అయితే అలాంటి ఒక హీరో ఒక హీరోయిన్ ను ఒక వేడుకలో పొగిడాడు అంటే ఇంకా ఆ హీరోయిన్ ఆనందానికి హద్దులు ఉండవు కదా…అవును నిజమే మన స్టైలిష్ స్టార్ అందాల భామ లావణ్య త్రిపాఠి ని వీలైనంతవరకూ ఆకాశానికి ఎత్తేశాడు.
అల్లు శిరీష్ నటించిన ‘శ్రీరస్తు-శుభమస్తు’ సినిమా సక్సెస్ మీట్ కు వచ్చిన అర్జున్ ఈ సినిమాలో హీరోయిన్ గురించి మాట్లాడుతూ…ప్రస్తుతం వరస విజయాలతో దూసుకు పోతున్న లావణ్యా త్రిపాఠీ లక్ అల్లు శిరీష్ కు కూడ తాకడంతో ‘శ్రీరస్తు శుభమస్తు’ సూపర్ హిట్ వైపు పరుగులు తీస్తుంది అని అన్నాడు. అంతేకాకుండా మామూలుగా నా భార్య స్నేహకు ఏ హీరోయిన్ కూడా పెద్దగా నచ్చరు. ఇప్పటివరకూ ఆమె ఏ హీరోయిన్ కూ పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చిందీ లేదు.
అయితే లావణ్య త్రిపాఠి మాత్రం నా భార్య స్నేహకు బాగా నచ్చిందని చెప్పడమే కాకుండా బహుశా తనతో ఇప్పటిదాకా లావణ్య హీరోయిన్ గా చేయలేదు కాబట్టి తన భార్య స్నేహ అలాంటి కాంప్లిమెంట్ ఇచ్చి ఉంటుందని ఏకంగా బన్నీ తన భార్య స్నేహ పైనే సెటైర్లు వేసాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే…మీడియా సోదరులు మాత్రం, గతంలో సైతం బన్నీ రెజీనాని సైతం ఇలానే పొగిడాడు అని, ఇలా సంధర్భాన్ని బట్టి పొగడటం బన్నీకి అలవాటు అయిపోయింది అని వాళ్ళలో వల్లే జోక్స్ వేసుకుంటున్నారు.