స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మంచి నటుడిగానే కాకుండా గొప్ప మనసున్న వ్యక్తి అని మరోసారి నిరూపించుకున్నారు. ఓ బాబు ప్రాణాలు కాపాడి అతని తల్లిదండ్రులకు దేవుడయ్యారు. వివరాల్లోకి వెళితే.. పేద దంపతులైన దుర్గ, నాగార్జునులకు ఓ బాబు(నితీష్) పుట్టాడు. అతనికి ఏడునెలలకే కాలేయానికి సంబంధించిన ప్రాణాంతక వ్యాధి సోకింది. నయం చేయాలంటే వైద్యులు 25 లక్షలు అవసరమవుతుందని చెప్పారు. ఏమి చేయాలో తెలియక బాధపడుతున్న వారికి అల్లు అర్జున్ దేవుడిలా వచ్చి వైద్యానికి 8 లక్షలు సాయం చేశారు.
అది తెలిసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కొంతమంది సెలెబ్రిటీలు తమకు తోచిన ఆర్ధిక సాయం అందించారు. దీంతో నితీష్ కి ఆపరేషన్ జరిగింది. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. దీంతో నాగార్జున తన కొడుకు బతకడానికి కారణమైన బన్నీకి కృతజ్ఞతలు తెలిపాడు. దేవుడిలా వచ్చి అల్లు అర్జున్ ఆదుకున్నారని అందరికీ చెబుతున్నారు. ఇప్పటివరకు అల్లు అర్జున్ తాను చేసిన సాయాన్ని కూడా చెప్పుకోలేదు. వందలు, వేలు ఆర్ధిక సాయం అందించినా కొందరు ప్రచారం చేసుకుంటుంటే.. దానికి భిన్నంగా బన్నీ నడుచుకొని మరింతమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.