బన్నీ ఏంటి అలా అనేశాడు!

Advertisement

సమ్మర్ లో ‘సరైనోడు’ సినిమాతో హిట్ కొట్టిన అల్లు అర్జున్ తదుపరి సినిమా లింగుస్వామితో ఉంటుందని భావించారు. అయితే తన కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న హరీష్ శంకర్ కు బన్నీ అవకాశం ఇచ్చాడని.. దిల్ రాజు ప్రొడక్షన్ లో ఈ సినిమా ఉంటుందని న్యూస్ వచ్చింది. శృతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్ అని కూడా మాటలు వినిపించాయి. అయితే రీసెంట్ గా బన్నీ మాటలు వింటుంటే మాత్రం తను ఈ సినిమాపై కాన్ఫిడెంట్ గా లేడని తెలుస్తోంది.

సింగపూర్ లో జరిగిన ‘సైమా’ అవార్డ్స్ లో బన్నీని మీ తదుపరి చిత్రాలేంటని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా దాటేశాడు. కొంచెం సమయం గ్యాప్ తీసుకొని ‘దిల్ రాజు ప్రొడక్షన్ లో హరీష్ శంకర్ గారితో ఏదో అనుకుంటున్నామని’ సమాధానమిచ్చాడు. రీసెంట్ గా ఈ సినిమాకు ఇంకా కథ సిద్ధం కాలేదని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు బన్నీ చెప్పిన ‘ఏదో అనుకుంటున్నాం’ మాట వింటుంటే ఆ వార్తల్లో నిజముందనే అర్ధమవుతుంది.

ఎందుకంటే కథ పక్కాగా లేకపోతే బన్నీ సెట్స్ పైకి వెళ్ళడు. కావాలంటే రెండు, మూడు నెలలు ఖాళీగా అయినా.. ఉంటాడేమో కానీ సగం స్క్రిప్ట్ తో మాత్రం ముందుకు వెళ్ళడు. సో.. బన్నీ-హరీష్ శంకర్ ల సినిమాపై కాస్త అనుమానంగానే ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus