Naga Babu: గంగోత్రి సినిమాలో ముందుగా అనుకున్న హీరో అల్లు అర్జున్ కాదా.. మరెవరంటే?

  • January 31, 2023 / 06:28 PM IST

మెగా కాంపౌండ్ నుంచి ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోలుగా కొనసాగుతూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోలు వచ్చారు. అలాగే చిరంజీవి స్ఫూర్తితోనే మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. ఇంత సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి అల్లు అర్జున్ పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించిన ఈయన హీరోగా మాత్రం గంగోత్రి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అద్భుతమైన విషయాన్ని అందుకుంది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నాగబాబు ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ మా ఇంట్లో నుంచి అంతమంది హీరోలు ఇండస్ట్రీలోకి అడుగు పెడతారని మేము కూడా ఊహించలేదని తెలిపారు. ఇలా మెగా కాంపౌండ్ నుంచి హీరోలుగా అడుగుపెట్టిన వారిలో బన్నీ ఒకడు

అయితే బన్నీ హీరోగా పరిచయమైనటువంటి గంగోత్రి సినిమాకు ముందుగా అల్లు అర్జున్ ఫస్ట్ ఛాయిస్ కాదని నాగబాబు తెలిపారు. ఈ సినిమా కథ ముందుగా రాంచరణ్ వద్దకు వెళ్లిందని,అయితే ఈ సినిమా కథ విన్నటువంటి అన్నయ్య ఈ సినిమాకు రాంచరణ్ సూట్ అవ్వడు బన్నీ కరెక్ట్ గా సరిపోతాడని చెప్పినట్లు నాగబాబు తెలిపారు.రామ్ చరణ్ కు యాక్టింగ్ లో మరింత మెచ్యూరిటీ అవసరం అందుకే ఈ సినిమా రామ్ చరణ్ కన్నా అల్లు అర్జున్ కు కరెక్ట్ గా సరిపోతుందని

చిరంజీవి చెప్పడంతో ఈ సినిమా అవకాశం అల్లు అర్జున్ వద్దకు వెళ్లిందని తెలుస్తోంది.ఇలా గంగోత్రి సినిమాతో తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన అల్లు అర్జున్ ఇండస్ట్రీలో అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్నారు. త్వరలోనే ఈయన పుష్ప 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus