అల్లు అర్జున్ మాటకు నో అంటోన్న కూతురు!

అల్లు అర్జున్ ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే కొన్ని సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా పని చేస్తూ చాలా బిజీగా ఉంటాడు. ఎంత బిజీగా ఉన్నా తన ఫ్యామిలీ కోసం ఎప్పుడూ తగిన సమయాన్ని కేటాయిస్తూ… పక్కా ‘ఫ్యామిలీ మెన్’ అనిపించుకుంటున్నాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి ఇద్దరు పిల్లలు. కొడుకు అల్లు అయాన్, కూతురు అల్లు అర్హ. ఈ ఇద్దరి పిల్లలతో అల్లు అర్జున్ దిగే ఫోటోలు,వీడియోలు.. సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. తాజాగా తన కూతురు అల్లు అర్హతో సరదాగా ఆడుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ వీడియో లో అల్లు అర్జున్ తన కూతురు అర్హతో సరదాగా అల్లరి చేస్తున్నాడు. ఇందులో బన్నీ తన కూతురిని ”నాన్న… నేను… నువ్వు చెప్పిన… అబ్బాయిని పెళ్ళి చేసుకుంటాను అని చెప్పు” అంటూ తన కూతురిని అడిగితే.. అర్హ మాత్రం ‘చేసుకోను..’ అంటూ నవ్వుకుంటూ చెప్పినసమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోకి ‘మై దొంగ ఫెలో’ అంటూ ట్యాగ్ లైన్ ఇచ్చాడు బన్నీ. అయితే ఈ వీడియోకి స్నేహ రెడ్డి ‘నువ్వు చేసుకున్నావా మీ నాన్న చెప్పిన అమ్మాయినీ’ అంటూ అల్లు అర్జున్ కి పంచ్ ఇవ్వడం విశేషం. ఇక తన కూతురిని ఇంతగా ముద్దు చేయడం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇక అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న చిత్రం మార్చి నుండీ మొదలు కాబోతుందని సమాచారం.

View this post on Instagram

#AlluArjun #Aarha అల్లు అర్జున్ – నేను చెప్పిన వాళ్ళని పెళ్లి చేసుకుంటావా ? అర్హ – చేసుకోను :p HAHA. cutest conversation between allu arjun with his daughter Arha :p

A post shared by Filmy Focus (@filmyfocus) on

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus