అల్లు అర్జున్ స్టైలిష్ హీరో మాత్రమే కాదు.. తెలివైన హీరో అని కూడా చెప్పొచ్చు. అతను సినిమాలను ఒప్పుకోవడంలో కొంతకాలంగా ఓ స్టాటజీ ఫాలో అయ్యేవారు. బన్నీకి స్టోరీ నచ్చడమే కాదు.. డైరక్టర్స్ కెరీర్ ట్రాక్ కూడా నచ్చాలి. అప్పుడే ఒకే చెప్పేవారు. అయితే ఈ మధ్య తన ప్లాన్ ని తానే చేంజ్ చేసుకున్నారు. కొత్తవాళ్ళకి అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. దువ్వాడ జగన్నాథం తర్వాత బన్నీ ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో “నా పేరు సూర్య” సినిమా చేస్తున్నారు. దీని తర్వాత ఫ్లాప్ డైరక్టర్ తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. “ఎక్కడికి పోతావు చిన్నవాడా” సినిమాతో వి.ఐ ఆనంద్ దర్శకుడిగా తొలి విజయాన్ని అందుకున్నారు. అంతకముందు చేసిన మూడు సినిమాలు ఫెయిల్ అయినప్పటికీ.. ఈ సినిమా టేకింగ్ నచ్చి అందరూ అభినందించారు.
అల్లు అర్జున్ అయితే తనకోసం ఓ కథని రెడీ చేయమని చెప్పారు. అలాగే తమ్ముడు శిరీష్ ని అతని దర్శకత్వంలో నటించమని చెప్పారు. దాంతో అల్లు శిరీష్ “ఒక్క క్షణం” అనే చిత్రాన్ని చేశారు. ఇది బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో బన్నీకి దిమ్మదిరిగింది. కొత్తవారితో పోతే తాను అడ్రస్ లేకుండా పోతానని బయపడి.. పాత బాటలోకి వచ్చినట్టు తెలిసింది. హిట్ ట్రాక్ లో ఉన్న క్రిష్ కి ఒకే చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం క్రిష్ కంగనా రనౌత్ తో మణికర్ణిక మూవీ చేస్తున్నారు. దీనితర్వాత అల్లు అర్జున్ ని డైరక్ట్ చేయనున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు.