భలే భలే మగాడివోయ్, సోగ్గాడి చిన్ని నాయనా చిత్రాలతో విజయాలను అందుకున్న లావణ్య త్రిపాఠి నటించిన తాజా సినిమా “శ్రీరస్తు – శుభమస్తు” హిట్ కావడంతో లక్కీ హ్యాండ్ గా పరిశ్రమలో పేరు తెచ్చుకుంది. అల్లు అరవింద్ చిన్న కొడుకు అల్లు శిరీష్ ఈ మూవీతో హిట్ ట్రాక్ లోకి వచ్చాడు. అందుకే శిరీష్ కి లావణ్యపై ప్రత్యేక అభిమానం ఏర్పడింది. అందుకే లావణ్యతో అడిగి మరి తిట్టించుకుంటున్నాడు.
జీన్స్ కార్యక్రమంలో “శిరీష్” ని బేవార్స్ ఎదవ అని తిట్టేసింది. ప్రస్తుతం ఒకరినొకరు పబ్లిక్ గా తిట్టుకోవడమే కాదు.. సోషల్ మీడియా వేదికగా ఒకరినొకరు ఆటపట్టిస్తున్నారు. ఏదో గల్లీలో ఉన్న “లావణ్య హెర్బల్ బ్యూటీ పార్లల్ ” బోర్డు ని ఫోటో తీసి ట్విట్టర్ లో అప్ లోడ్ చేసి “లావణ్య కొత్త బిజినెస్ ప్రారభించినందుకు అభినందనలు. వ్యాపారం బాగా జరగాలని కోరుకుంటున్నాను” అని ట్వీట్ చేసాడు. దానికి హీరోయిన్ లావణ్య వెంటనే స్పందించింది. “ధన్యవాదాలు. మేము కొత్త వారిని ప్రోత్సహిస్తున్నాము. నువ్వు వచ్చి అదృష్టాన్ని పరీక్షించుకో” అని కౌంటర్ ఇచ్చింది. “లేడీస్ పార్లర్లో మగవాళ్లకు పని ఏమిటి? ఇంతకీ అది పార్లలా? ఇంకా ఏమైనా? ” అని రీ ట్వీట్ తో శిరీష్ ఆట పట్టించాడు.
Congrats @Itslavanya on your new venture. Good luck & best wishes. 😉 😛 pic.twitter.com/GHq20rerZ9
— Allu Sirish (@AlluSirish) August 23, 2016