బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నభా నటేష్, అనూ ఇమ్మాన్యుయల్ లు హీరోయిన్లుగా ‘కందిరీగ’ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘అల్లుడు అదుర్స్’. సోనూ సూద్, ప్రకాష్ రాజ్ లు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైన ఈ చిత్రం మొదటి షో తోనే డివైడ్ టాక్ ను మూటకట్టుకుంది. ‘సినిమా మొత్తం ‘కందిరీగ’ కు సీక్వెల్ గా ఉంది’ అనే కామెంట్లు కూడా వినపడ్డాయి. అయితే కొంతమంది ఊరమాస్ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారు. దాంతో ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ నమోదయ్యాయని చెప్పొచ్చు.
ఇక ఈ చిత్రం 5 రోజుల కలెక్షన్లను ఓసారి గమనిస్తే :
నైజాం | 2.02 cr |
సీడెడ్ | 1.31 cr |
ఉత్తరాంధ్ర | 1.28 cr |
ఈస్ట్ | 0.44 cr |
వెస్ట్ | 0.44 cr |
కృష్ణా | 0.25 cr |
గుంటూరు | 0.46 cr |
నెల్లూరు | 0.21 cr |
ఏపీ+తెలంగాణ టోటల్ | 6.41 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.12 cr |
ఓవర్సీస్ | 0.05 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 6.58 cr |
‘అల్లుడు అదుర్స్’ చిత్రానికి 13కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇందులో చాలా వరకూ నిర్మాత ఓన్ రిలీజ్ చేసుకున్నాడు కాబట్టి.. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే 10కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది.విడుదలై 5 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 6.58కోట్ల షేర్ ను రాబట్టింది.సంక్రాంతి పండుగ కావడంతో.. అల్లుడుకి బాగానే వర్కౌట్ అయ్యింది. అయితే వీక్ డేస్ లో అల్లుడి పెర్ఫార్మన్స్ ఎలా ఉంటుందో.. . బ్యాలన్స్ 3.42 కోట్ల షేర్ రాబడతాడో లేదో తెలియాల్సి ఉంది.
Click Here To Read Movie Review
Most Recommended Video
మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!