తాను ఒక శాడిస్ట్ నంటూ అక్కినేని నాగార్జున, అమలల ముద్దుల కుమారుడు అఖిల్ స్వయంగా చెప్పి అభిమానులకు షాక్ ఇచ్చాడు. తానొక సెలెబ్రిటీ కొడుకులా కాకుండా అందరి పిల్లలా అల్లరి చేస్తూ పెరిగానని వెల్లడించాడు. ఇంట్లో తన చేష్టలకు డెవిల్ పేరు సంపాదించుకున్నట్లు అక్కినేని ప్రిన్స్ తెలిపాడు. అయితే హార్రర్ సినిమాలంటే విపరీతమైన భయమని, కనీసం ట్రైలర్స్ కూడా చూడనని అసలు విషయం బయట పెట్టాడు.
“నాకు ఈ మధ్య ఓ డైరక్టర్ హర్రర్ సినిమా కథ చెప్పారు. స్టోరీ చాలా బాగుంది. కానీ, నా వల్ల కాదు అని చెప్పేసాను” అని వివరించారు. “ఆ కథ విన్న తర్వాత ఏడు రోజుల పాటు అర్ధరాత్రి సమయంలో పడుకోలేదు. ఆరు దాటిన తర్వాత కర్టన్స్ తీసి నిద్రపోయాను. నాకంటే చైతూకు మరింత భయం. హర్రర్ స్టోరీ అంటే పారిపోతాడు” అని అన్న దమ్ముల భయం గురించి సరదాగా చెప్పాడు. తన వ్యక్తిగత విషయాలను ఏమి దాచుకోకుండా చెప్పి అఖిల్ అభిమానులను ఆకట్టుకున్నాడు. సినీ పరిశ్రమకు చెందని మిత్రులతో జాలీగా ఉంటానని, వారిని భలే ఏడిపిస్తానని, అందుకే వారు తనని శాడిస్టు అని పిలుస్తారని అఖిల్ వెల్లడించాడు. కింగ్ తనయుడు హను రాఘవపూడి దర్శకత్వంలో నటించేందుకు అంతా సిద్దమయింది.