మొత్తానికి ‘అం అః’ చిత్రం విడుదలకు మోక్షం

ప్రస్తుతం ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడం, థియేటర్లకు రప్పించడం చాలా కష్టంగా మారింది. డిఫరెంట్ కంటెంట్ ఉంటే తప్పా ప్రేక్షకులు సినిమాలను ఆదరించడం లేదు. ఇలాంటి తరుణంలోనే డిఫరెంట్ టైటిల్, నేటితరం ఆడియన్స్ కోరుకునే థ్రిల్లింగ్ సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘అం అః’. మునుపెన్నడూ చూడని డిఫరెంట్ కథతో డైరెక్టర్ శ్యామ్ మండ‌ల ప్రయోగం చేస్తున్నారు. సుధాక‌ర్ జంగం, లావ‌ణ్య హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ ‘అం అః’ చిత్రానికి ‘ఎ డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్’ ట్యాగ్‌లైన్‌ పెట్టారు.

రంగ‌స్థ‌లం మూవీ మేక‌ర్స్‌, శ్రీ ప‌ద్మ ఫిలిమ్స్ బ్యాన‌ర్స్‌పై జోరిగె శ్రీనివాస్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సందీప్ కుమార్ కంగుల‌ సంగీతం అందిస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా రీసెంట్‌గా ఈ మూవీ పోస్ట‌ర్, ‘నీ మనసే నాదని’ వీడియో సాంగ్ హ్యుజ్ రెస్పాన్స్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.

సస్పెన్స్‌కి తోడు రొమాంటిక్ సన్నివేశాలు, యూత్ ఆడియన్స్ మెచ్చే అంశాలతో రూపొందిన ఈ చిత్రం విడుదల తేదీని మేకర్లు తాజాగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 16న భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు ప్రకటించారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus