Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » సినిమాను చూసి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను.. ‘అం అః’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత శ్రీనివాస్ రావు

సినిమాను చూసి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను.. ‘అం అః’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత శ్రీనివాస్ రావు

  • August 17, 2022 / 07:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సినిమాను చూసి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను.. ‘అం అః’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత శ్రీనివాస్ రావు

డిఫరెంట్ టైటిల్, నేటితరం ఆడియన్స్ కోరుకునే థ్రిల్లింగ్ సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘అం అః’ మూవీ. మునుపెన్నడూ చూడని డిఫరెంట్ కథకు తెరరూపమిస్తూ డైరెక్టర్ శ్యామ్ మండ‌ల ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సుధాక‌ర్ జంగం, లావ‌ణ్య హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ ‘అం అః’ చిత్రానికి ‘ఎ డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్’ ట్యాగ్‌లైన్‌ పెట్టారు. రంగ‌స్థ‌లం మూవీ మేక‌ర్స్‌, శ్రీ ప‌ద్మ ఫిలిమ్స్ బ్యాన‌ర్స్‌పై జోరిగె శ్రీనివాస్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్ట్ 19న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో..

నిర్మాత శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. ‘ఈ సినిమాను ప్రారంభించడానికి చాలా టైం వచ్చింది. ముందు శ్యాం గారు నా వద్దకు ఓ కథ తీసుకొని వచ్చారు. అయితే దానికి ఎక్కువ బడ్జెట్ అవుతుందనిపించింది. ఆ తరువాత నవీన్ గారు మరో కథను తీసుకొచ్చారు. దాని మీద చాలా పని చేశాం. ఈ కథకు కొత్త వాళ్లు అయితే బాగుందని అనుకున్నాం. ఆ టైంలో మాకు సుధాకర్ కనిపించారు. ఈ సినిమా సమయంలో రెండు పాండమిక్స్ వచ్చాయి. అయినా తట్టుకున్నాం. దర్శకుడు ఎంతో కష్టపడి ఈ సినిమాను చేశారు. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. అందరూ మనసారా శాయశక్తులా పని చేశారు. ఆగస్ట్ 19న విడుదల కాబోతంది. ఇందులో శ్యామ్ గారి పనితనం చూస్తే మైండ్ బ్లాక్ అవుతంది.. మళ్లీ మళ్లీ సినిమాను చూస్తారు. అంత గ్రిప్పింగ్‌గా ఉంటుంది. ఒళ్లంతా రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటుంది. సినిమాను చూసి విజయవంతం చేయాలని మనసారా కోరుకుంటున్నాను’ అని అన్నారు.

సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఈ స్థాయి వరకు నేను రావడానికి ఎంతో మంది త్యాగం ఉంది. అందులో నా పేరెంట్స్ గురించి ముఖ్యంగా చెప్పాలి. ఆ తరువాత మా బ్రదర్. అం అ: అనే టీం నన్ను నమ్మింది. సక్సెస్ అవుతాడా? లేదా? అనే ఆలోచనలు పెట్టుకోకుండా నన్ను నమ్మి ఇంత వరకు తీసుకొచ్చారు. నా కుటుంబం నాకు అండగా నిలబడింది. ఈ టీం నన్ను నమ్మింది. నా నిర్మాతలు నన్ను నమ్మి.. వారి టైం, డబ్బు నా మీద ఖర్చు పెట్టినందుకు రుణపడి ఉంటాను. నాతో వర్క్ షాప్‌లు చేయించి ఇంత బాగా సినిమాను తీసిన దర్శకుడికి ధన్యవాదాలు. అం అ: సైన్యం ఉంది. వారందరి గురించి సక్సెస్ మీట్‌లో చెబుతాను. ప్రతీ ఒక్కరి కష్టం వల్లే ఈ సినిమా ఈ స్థాయి వరకు వచ్చింది. హీరోయిన్ లావణ్య, శిరీషలు చక్కగా నటించారు. కొత్త వాడిని అని చూడకుండా ముందుకు వచ్చి నటించారు.

డైరెక్టర్ శ్యామ్ మండల మాట్లాడుతూ.. ‘ఇది నాకు ఫస్ట్ థియేటర్ మూవీ. నాకు ఈ అవకాశం అంత ఈజీగా రాలేదు. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. నా కల సాకారం అవ్వడానికి మా నిర్మాత కారణం. సురేందర్ రెడ్డి, గుణ శేఖర్, వైవీఎస్ చౌదరిల వద్ద ఓ పదమూడేళ్లు పని చేశాను. స్క్రీన్ ప్లే ఎంగేజింగ్‌గా ఉండేలా కథ రాసుకుంటారు. వారి దగ్గరి నుంచి అది నేను నేర్చుకున్నాను. ఇందులో అప్లై చేశాను. నాకు ఈ టీం అంతా కూడా ఎంతో సహకరించింది. నవీన్ ఇరగాని నాకు ఈ సబ్జెక్ట్‌ అందించి సాయం చేశారు. కరోనా సమయంలో ఈ సినిమాను ప్రారంభించాం. కరోనా మధ్యలో ఓ చిన్న చిత్రం చేశాం. ట్రూ అనే చిత్రం అమెజాన్‌లో 25 రోజులు టాప్ వన్ ప్లేస్‌లో ట్రెండ్ అయింది. దాని కంటే వంద శాతం ఎక్కువగా కష్టపడ్డాం. ఆ సినిమా కంటే ఇది పదిరెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం మా నిర్మాత. మా కెమెరామెన్ ఎంతో సాయం చేశారు. కొత్త డైరెక్టర్‌ అని చూడకుండా ఎంతో హెల్ప్ చేశారు. జె.పి ఎడిటింగ్ చాలా పదునుగా ఉంటుంది. సైరా, ఏజెంట్ వంటి పెద్ద సినిమాలకు పని చేసే క్యాస్టూమ్ డిజైనర్ రామ్ గారు అద్భుతంగా డిజైన్ చేయించి ఇచ్చారు. ఓ డైరెక్టర్‌ను సంతృప్తి పర్చడం అంత సులభం కాదు. కానీ సుధాకర్ గారు ఎంతో బాగా నటించారు. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ అన్నింట్లోనూ ఎంతో శ్రద్ద చూపించారు. అది చూసి నాకే షాకింగ్‌గా అనిపించింది. కొత్త హీరోతో కాదు సీనియర్ హీరోతో పని చేసినట్టు అనిపించింది. ఈ సినిమాకు ఆక్సిజన్ సుధాకర్ గారే. నా ఫ్రెండ్స్ నన్ను ఎఫ్పుడూ ప్రోత్సహిస్తూ ఉంటారు.ఈ చిత్రంలో లావణ్య, సిరిలు హీరోయిన్లు. మంచి పాత్రలు పోషించారు. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.

హీరోయిన్ సిరి కనకాల మాట్లాడుతూ.. ‘నేను అనంతపురం అమ్మాయిని. బెంగళూరులో ఉంటాను. షార్ట్ ఫిల్మ్స్ చేస్తుండేదాన్ని. ఇలాంటి చిత్రంలో నాకు ఆఫర్ వస్తుందని నేను అనుకోలేదు. శ్యామ్ సర్ పెద్ద పెద్ద ఆర్టిస్టులతో పని చేశారు. కానీ నాకు ఈ అవకాశం ఇచ్చారు. నన్ను నమ్మి ఈ పాత్రను ఇచ్చినందుకు థాంక్స్. నాకు సపోర్ట్ ఇచ్చిన నిర్మాత, హీరోకు థాంక్స్. నన్ను అందంగా చూపించిన కెమెరామెన్‌కు థాంక్స్. మా సినిమా ఆగస్ట్ 19న రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

ఎడిటర్ జె.పి మాట్లాడుతూ.. ‘నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. మా హీరో సుధాకర్ రెడ్డి మొదటి చిత్రంలోనే బాగా చేశారు. సినిమా బాగా వచ్చింది. మా సినిమా ఆగస్ట్ 19న రాబోతోంది’ అని అన్నారు.

కెమెరామెన్ శివా రెడ్డి మాట్లాడుతూ.. ‘నాకు ఈ చాన్స్ ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు థాంక్స్. ఇప్పటికే ఈ సినిమాను ఐదారు సార్లు చూశాను. చాలా బాగా వచ్చింద’ అని అన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Am Aha
  • #am aha pre release event

Also Read

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

related news

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

trending news

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

6 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

6 hours ago
Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

23 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

1 day ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

2 days ago

latest news

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

1 day ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

1 day ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

1 day ago
Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

1 day ago
Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version