బాలీవుడ్ లో రొమాంటిక్ హీరో అంటే వెంటనే గుర్తొచ్చేది షారూఖ్ ఖాన్. కేవలం రొమాన్స్ మాత్రమే కాదు ఏ పాత్రలో అయినా.. ఒదిగిపొయే తత్వం గల నటుడు. కానీ రొమాంటిక్ సీన్స్ లో మాత్రం ఆయనకు మరెవరూ సాటిరారు. అంతగా ఇమిడిపోయి నటిస్తాడు. అందుకే ఈ వయసులో కూడా ఆయనకు రొమాంటిక్ స్టార్ అని పిలుచుకుంటుంటారు.
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు నేను హ్యాపీగా రొమాన్స్ చేసుకుంటానని సమాధానమిచ్చాడు ఈ స్టార్ హీరో. అసలు విషయంలోకి వస్తే.. అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు మల్లయుద్ధం కాన్సెప్ట్ మీద సినిమాలు తీస్తున్నారు.. మీరు అటువంటి సినిమాల్లో ఎప్పుడు నటిస్తారని మీడియాలో ఎదురైన ప్రశ్నకు నేను రొమాన్స్ పండించడంలో నిష్ణాతుడ్ని అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లను యుద్ధాలు, మల్లయుద్ధాలు చేయనివ్వండి.. నేను హ్యాపీగా రొమాన్స్ చేసుకొంటాను’ అని సమాధానం ఇచ్చాడు.