నేనూ…ఐటమ్ సాంగ్స్ చేస్తా అంటున్న హాట్ బ్యూటీ!!!

టాలీవుడ్ లో తన లక్ ను పరీక్షించుకుని, అటుపై అక్కడ వర్కౌట్ కాక మళ్లీ బుల్లి తెరపై యాంకర్ అవతారం ఎత్తింది సెక్సీ యాంకర్ కమ్ యాక్టర్ రేష్మి గౌతమ్. ప్రముఖ ఈటీవీ ఛానెల్ వాళ్ళు నిర్వహిస్తున్న “జబర్దస్త్” ప్రోగ్రామ్ లో హాట్ యాంకర్ గా తన ఆహార్యాన్ని ప్రదర్శిస్తూనే, అదే క్రమంలో తన అందాల ఆరబోతను సైతం అందరికీ వండి వడ్డిస్తుంది. ఇదిలా ఉంటే వెండి తెరపై వెలిగిపోవాలని ఉన్న రేష్మి అనేక ప్రయత్నాలు చేస్తుంటే ఉంది. ఇప్పటికే రెండు, మూడు సినిమాల్లో తలుక్కున మెరిసి తన అందాలతో ప్రేక్షకులకు విందు భోజనం పెట్టేసింది.

ఇక అదే క్రమంలో తన ఫిజిక్ ను చాలా హాటుగా ఉండేలా చూసుకోవడంతో.. ఈమెకు గ్లామర్ లవర్స్ బ్రహ్మరథం పట్టేశారు కూడా. ఇదిలా ఉంటే తాజాగా రేష్మి ని ఒకానొక ఇంటెర్వ్యులో ఒక విలేఖరి ఐటమ్ సాంగ్స్ గురించి మాట్లాడుతూ….ఒకవేళ మీకు మెగాస్టార్ 150వ సినిమాలో ఒక ఐటెం సాంగ్ చేయమని వస్తే చేస్తారా?? అని అడగగానే…వెంటనే…చేస్తాను. చేస్తాను” అంటూ సమాధానం ఇచ్చింది ఈ బ్యూటీ…అదే క్రమంలో అసలు 150వ సినిమాలోనే కాదు.. ఎవ్వరు ఏ సినిమాలో ఐటెం సాంగ్స్ చేయమన్నా నేను రెడీ అంటుంది ఈ హాట్ బ్యూటీ.

అయితే ఇలా హాట్ గా కనిపించడం తప్పు కదా అంటే….తప్పేముంది ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలి అంటే అందాల ఆరబొత కూడా యాక్టింగ్ లో భాగమే అంటుంది. అంతే కాదండోయ్….అసలు రష్మి విషయంలో ఇప్పటివరకు వచ్చిన ఆఫర్లన్నీ గ్లామరసం ఒలకబోసేవేగా…మరి అదీ లెక్క….మన ఇండస్ట్రీకి మరో ముమాయత్ దొరికేసినట్లే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus