విలన్ పాత్రనైనా చేస్తానన్న నాగార్జున

  • June 20, 2016 / 11:37 AM IST

నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను చేయడానికి కింగ్ నాగార్జున ఎల్లప్పుడూ ముందు ఉంటారు. ఆ విషయాన్ని నాగ్ అందరి ఎదుట మరో మారు స్పష్టం చేసారు. తన కొడుకు యువ సామ్రాట్ నాగ చైతన్య కొత్త సినిమా ‘సాహసం శ్వాసగా సాగిపో’ ఆడియో విడుదల శుక్రవారం జరిగింది. ఈ వేడుకలో నాగార్జున ఆస్కార్ గ్రహీత ఏ.ఆర్.రెహమాన్ ను అభినందిచారు. వయసులో తక్కువైనా, సాధించిన విజయాలకు గౌరవంగా సార్ అని పిలిచారు.

30 ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్న తనతో ఒకేఒక్క సినిమా చేసి, చైతన్యతో మాత్రం రెండు సినిమాలు చేస్తారా? అని సరదాగా ప్రశ్నించారు. అయినా తన కుటుంబం వారితో పని చేస్తున్నందుకు సంతోషంగా ఉందని మన్మధుడు చెప్పారు. అనంతరం దర్శకుడు గౌతమ్‌మీనన్ గురించి మాట్లాడుతూ “గౌతమ్‌ మీరు చైతూ కి కథ చెప్పడానికి వచ్చినప్పుడల్లా .. “మీ కోసం ఓ కథ రెడీ చేసాను .. అందులో మీది నెగటివ్ రోల్. చేస్తారా అని” అడుగుతారు.

నేను చేయడానికి సిద్దమని చెప్పినా .. ఆ సినిమా గురించి మాట్లాడరు. గౌతమ్ మీ సినిమాలో ఏ పాత్ర ఇచ్చినా చేస్తాను” అని అందరి ముందు కింగ్ చెప్పారు. గౌతమ్‌ ఏమి మాట్లాడకుండా నవ్వుతూ ఉండిపోయారు. అయితే భవిష్యత్ లో వీరిద్దరి కాంబినేషన్లో ఓ చిత్రాన్ని ఆశించవచ్చు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus