Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » అగ్ని ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన పెంచడం ఎంతో అవసరం : శ్రీమతి అమల అక్కినేని

అగ్ని ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన పెంచడం ఎంతో అవసరం : శ్రీమతి అమల అక్కినేని

  • April 15, 2019 / 12:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అగ్ని ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన పెంచడం ఎంతో అవసరం : శ్రీమతి అమల అక్కినేని

1944 సంవత్సరం ఏప్రిల్‌ 14న ముంబాయిలోని డాక్‌ యార్డ్‌లోని షిప్‌ జరిగిన అగ్నిప్రమాదంలో ప్రజల్ని కాపాడే క్రమంలో 66 మంది ఫైర్‌ ఫైటర్స్‌ ప్రాణాలు కోల్పోయారు. వారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ 14 నుంచి 20 వరకు దేశవ్యాప్తంగా అగ్నిమాపక వారోత్సవాలు జరపడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌ ఫైర్‌ స్టేషన్‌లో అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీమతి అమల అక్కినేని హాజరయ్యారు. ఇంకా ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ డిస్ట్రిక్ట్‌ ఫైర్‌ ఆఫీసర్‌ సురేష్‌రెడ్డి, డిస్ట్రిక్ట్‌ ఫైర్‌ ఆఫీసర్‌ శ్రీనివాసరెడ్డి, ఫిలింనగర్‌ ఫైర్‌స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌ చంద్రశేఖర్‌, అన్నపూర్ణ స్టూడియోస్‌ వి.సత్యానంద్‌తోపాటు ఫైర్‌ స్టేషన్‌ సిబ్బంది, ఫిలింనగర్‌ వాసులు పాల్గొన్నారు.

ముందుగా విధి నిర్వహణలో అసువులు బాసిన ఫైర్‌ ఫైటర్స్‌కి శ్రద్ధాంజలి ఘటించారు శ్రీమతి అమల అక్కినేని. అనంతరం అగ్ని ప్రమాదాలు జరిగినపుడు ఫైర్‌ సిబ్బంది ఉపయోగించే పరికరాలను పరిశీలించారు. అసిస్టెంట్‌ డిస్ట్రిక్ట్‌ ఫైర్‌ ఆఫీసర్‌ సురేష్‌రెడ్డి ఆయా పరికరాలను ఎలా, ఎందుకు ఉపయోగిస్తారనేది వివరించారు. ఆ తర్వాత ఫైర్ స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు అమల అక్కినేని. అనంతరం జరిగిన కార్యక్రమంలో వారోత్సవాలకు సంబంధించిన వివిధ రకాల పాంప్లెట్స్‌ను, పోస్టర్స్‌ను శ్రీమతి అమల అక్కినేని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా శ్రీమతి అమల అక్కినేని మాట్లాడుతూ ”డిస్ట్రిక్ట్‌ ఫైర్‌ ఆఫీసర్స్‌కి, స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌కి, సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారం. ఈరోజు ప్రారంభమవుతున్న అగ్నిమాపక వారోత్సవాలకు నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. ప్రజల్లో అగ్ని ప్రమాదాల గురించి, ఫైర్‌ ఫైటర్స్‌ గురించి అవగాహన తీసుకు రావడం చాలా అవసరం. ఈమధ్య మా అన్నపూర్ణ స్టూడియోస్‌లో కూడా ఒక ట్రైనింగ్‌ జరిగింది. ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి అందరూ వచ్చారు. మా ఎంప్లాయీస్‌, అన్నపూర్ణ ఫిల్మ్‌ స్కూల్‌ విద్యార్థులతోపాటు నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను. ఫైర్‌ ఫైటర్స్‌ కష్టాలేమిటో అప్పుడు నాకు అర్థమైంది. ఒక్క నిమిషంలో ఫైర్‌ ఎంత స్పీడ్‌గా స్ప్రెడ్‌ అవుతుంది. ఎంత నష్టం కలిగిస్తుంది అనేది అప్పుడే నాకు తెలిసింది. ప్రమాదం జరిగిన సమయంలో మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాల గురించి అవగాహన చాలా అవసరం. ఈ కార్యక్రమం సంవత్సరం అంతా జరగాలని, మీకు అందరూ సహకారం అందించాలని కోరుకుంటున్నాను. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా పగలు, రాత్రి కృషి చేస్తున్న ఫైర్‌ సర్వీసెస్‌ డిపార్ట్‌మెంట్‌కి అభినందనలు. నాగార్జున తరఫున, అన్నపూర్ణ స్టూడియో తరఫున, మా కుటుంబం తరఫున, నా తరఫున ధన్యవాదాలు” అన్నారు.

ఈ సందర్భంగా చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ”మేము అన్నిరకాల విపత్తుల నుంచి ప్రజల్ని, జంతువులను కాపాడుతూ ఉంటాం. ఈమధ్య ఒక పక్షిని కూడా కాపాడి బ్లూ క్రాస్‌కి పంపించడం జరిగింది. ఈరోజు అగ్నిమాపక వారోత్సవాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన అమలగారికి మా స్టేషన్‌ సిబ్బంది తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం” అన్నారు. అసిస్టెంట్‌ డిస్ట్రిక్ట్‌ ఫైర్‌ ఆఫీసర్‌ సురేష్‌రెడ్డి మాట్లాడుతూ ”ఎంతో బిజీ షెడ్యూల్‌లో కూడా మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన బ్లూ క్రాస్‌ ఫౌండర్‌ అండ్‌ ఛైర్మన్‌ అమలగారికి కృతజ్ఞతలు. 1944లో ఇదే రోజున ముంబయిలోని ఒక డాక్‌ యార్డ్‌లోని షిప్‌లో ఫైర్‌ యాక్సిడెంట్‌ జరిగింది. అందులోని వారిని కాపాడే క్రమంలో 66 మంది ఫైర్‌ ఫైటర్స్‌ చనిపోయారు. అందుకే ప్రతి సంవత్సరం వారి జాపకార్థం ఏప్రిల్‌ 14 నుంచి 20 వరకు అగ్నిప్రమాదాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు పలు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది. అగ్ని ప్రమాదాలు జరగకుండా ఎలా నివారించాలి, ప్రమాదం జరిగినపుడు దాని నుంచి తమని తాము ఎలా కాపాడుకోవాలి అనే విషయాల్ని ఈరోజు విడుదల చేసిన ఈ పాంప్లేట్స్‌ని అందరికీ పంచుతూ వివరిస్తాం” అన్నారు.

డిస్ట్రిక్ట్‌ ఫైర్‌ ఆఫీసర్‌ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ”ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అగ్నిమాపక వారోత్సవాలు జరుపుతున్నాం. ఫైర్‌ యాక్సిడెంట్‌ అనేది ఎక్కడైనా జరగొచ్చు. అందుకే ఈ వారం రోజులు అగ్ని ప్రమాదాలపై అవగాహన పెంచేందుకు మా వంతు కృషి చేస్తాం. అంతేకాదు. మీ ఏరియాలకి వచ్చి అవగాహన సదస్సు చెయ్యడానికి కూడా మేం ముందుంటాం” అన్నారు. ఈ కార్యక్రమంలో ఫైర్‌ స్టేషన్‌ సిబ్బంది తరఫున ఒక మెమంటోను శ్రీమతి అక్కినేని అమలకు బహూకరించారు. అలాగే అన్నపూర్ణ స్టూడియోస్‌ వి.సత్యానంద్‌ను శాలువాతో సత్కరించారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Amala
  • #Akkineni Amala Latest news
  • #Amala Akkineni
  • #Amala Akkineni About Fire Awareness
  • #Amala Akkineni Latest

Also Read

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Tharun Bhascker: కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న తరుణ్‌ భాస్కర్‌.. ఆ డైరక్టర్‌ని రీప్లేస్‌ చేస్తూ..

Tharun Bhascker: కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న తరుణ్‌ భాస్కర్‌.. ఆ డైరక్టర్‌ని రీప్లేస్‌ చేస్తూ..

Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

Sri Vishnu: శ్రీవిష్ణుకి మైథాలజీ టచ్‌ ఇస్తున్న కుర్ర కామెడీ డైరక్టర్‌

Sri Vishnu: శ్రీవిష్ణుకి మైథాలజీ టచ్‌ ఇస్తున్న కుర్ర కామెడీ డైరక్టర్‌

Tollywood: మరోసారి టాలీవుడ్‌లో సినిమాల పోస్ట్‌ పోన్.. నాలుగు చిన్న సినిమాలకు తలనొప్పి

Tollywood: మరోసారి టాలీవుడ్‌లో సినిమాల పోస్ట్‌ పోన్.. నాలుగు చిన్న సినిమాలకు తలనొప్పి

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

trending news

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

23 hours ago
ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

23 hours ago
Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

1 day ago
Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Tollywood: ‘సినిమాను మెచ్చుకునే కణాలు’… టాలీవుడ్‌లో పూర్తిగా అయిపోయాయా?

Tollywood: ‘సినిమాను మెచ్చుకునే కణాలు’… టాలీవుడ్‌లో పూర్తిగా అయిపోయాయా?

1 day ago
Tollywood: అంతమంది కేమియోలతో మన సీనియర్‌ స్టార్లు సినిమా తీస్తే ఊరుకుంటారా?

Tollywood: అంతమంది కేమియోలతో మన సీనియర్‌ స్టార్లు సినిమా తీస్తే ఊరుకుంటారా?

1 day ago
Bishnoi Gang: టైగర్‌ ష్రాఫ్‌ కంటే ముందు మరో ఇద్దరు హీరోల ఇంటి దగ్గరా రెక్కీ.. ఎవరంటే?

Bishnoi Gang: టైగర్‌ ష్రాఫ్‌ కంటే ముందు మరో ఇద్దరు హీరోల ఇంటి దగ్గరా రెక్కీ.. ఎవరంటే?

1 day ago
Doosara: గంగూలీ ‘బయోపిక్‌’పై కోర్టు తీర్పు.. ఆ సినిమా రిలీజ్‌కి ఓకే

Doosara: గంగూలీ ‘బయోపిక్‌’పై కోర్టు తీర్పు.. ఆ సినిమా రిలీజ్‌కి ఓకే

1 day ago
Kayadu Lohar: ‘చుక్క’లు చూపిస్తున్న నెటిజన్లు.. పాత విమర్శలు బయటకు తీసి మరీ..

Kayadu Lohar: ‘చుక్క’లు చూపిస్తున్న నెటిజన్లు.. పాత విమర్శలు బయటకు తీసి మరీ..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version