Amala Paul: వైరల్ అవుతున్న అమలాపాల్ బేబీ బంప్ ఫొటోస్!

డస్కీ బ్యూటీ అమలాపాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె హీరోయిన్గా తమిళ మలయాళ తెలుగు చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించారు. అయితే ఇటీవల కాలంలో ఈమె సినిమాల పరంగా కూడా బోల్డ్ పాత్రలలో నటిస్తూ పెద్ద ఎత్తున వెండితెరపై అభిమానులను సందడి చేస్తున్నారు. ఇలా ఈమె కెరియర్ విషయం పక్కన పెట్టి వ్యక్తిగత విషయానికి వస్తే 2014వ సంవత్సరంలో కోలీవుడ్ డైరెక్టర్ విజయ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు.

ఇలా ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి వీరిద్దరూ ఎక్కువ కాలం పాటు వైవాహిక జీవితంలో సంతోషంగా గడపలేదని చెప్పాలి. వీరిద్దరూ కూడా మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక విడాకులు తీసుకున్న తర్వాత ఈమె బోల్డ్ పాత్రలలో నటిస్తూ వెండితెరపై సందడి చేశారు అయితే ఇటీవల ఈమె రెండో వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

జగత్ దేశాయ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి ఈమె పెళ్లయిన రెండు నెలలు కూడా తిరగకముందే తాను తల్లి కాబోతున్నాను అంటూ బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. అయితే ఈ ఫోటోలు పై ఎంతో మంది కామెంట్లు చేస్తూ ఈమె ప్రెగ్నెంట్ అయిన తరువాతనే హడావిడిగా పెళ్లి చేసుకున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇలా బేబీ బంప్ తో ఉన్నటువంటి అమలాపాల్ (Amala Paul) తాజాగా బీచ్ దగ్గర తన భర్తతో కలిసి రొమాంటిక్ పర్ఫామెన్స్ చేస్తూ రెచ్చిపోయారు ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలను ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇవి కాస్త క్షణాల్లో వైరల్ అయ్యాయి. ఇలా బేబీ బంప్ తో ఉన్నటువంటి ఈ ఫోటోలు నెట్టింట చెక్కర్లు కొడుతున్నాయి.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus