వెండితెరపై అమలాపాల్ సోదరుడు..!

  • June 18, 2016 / 07:39 AM IST

తెలుగు, తమిళ భాషల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న అమలాపాల్ ఇటీవలే తమిళ దర్శకుడు ఏ‌ఎల్ విజయ్ ను వివాహం చేసుకుంది. వివాహం అయిన తరువాత కూడా ఆమె పలు చిత్రాల్లో నటిస్తుండగా.. విజయ్ ప్రస్తుతం తమన్నా టైటిల్ పాత్రలో ‘అభినేత్రి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

ఈ చిత్రంలో ప్రభుదేవా కథానాయకుడిగా నటిస్తుండగా.. అమలాపాల్ సోదరుడు అభిజిత్ పాల్ ఈ చిత్రం ప్రముఖ పాత్ర పోషిస్తూ వెండి తెరారంగ్రేటం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ చిత్రంలో సోనూసూద్, ప్రభుదేవా వంటి అగ్రనటుల సరసన నటిస్తున్న అభిజిత్ చిత్ర పరిశ్రమలో మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకుంటాడేమో వేచిచూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus