దీపావళి కానుకగా 4 సినిమాలు విడుదలయ్యాయి. అందులో కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ (Sivakarthikeyan) నటించిన ‘అమరన్’’ (Amaran) కూడా ఉంది. సాయి పల్లవి హీరోయిన్ (Sai Pallavi) కావడం, కమల్ హాసన్ (Kamal Haasan) నిర్మాత కావడంతో మొదటి నుండి ఈ సినిమాపై హైప్ ఉంది.రాజ్‌కుమార్ పెరియసామి (Rajkumar Periasamy) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2014లో వీరమరణం పొందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ అనే సంగతి తెలిసిందే. మొదటి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్రహ్మాండంగా ప్రదర్శింపబడుతోంది.
ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ కూడా కంప్లీట్ చేసుకుంది. ఒకసారి 3 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 3.25 cr |
సీడెడ్ | 0.92 cr |
ఉత్తరాంధ్ర | 0.90 cr |
ఈస్ట్+వెస్ట్ | 0.32 cr |
కృష్ణా + గుంటూరు | 0.48 cr |
నెల్లూరు | 0.17 cr |
ఏపి+ తెలంగాణ(టోటల్) | 6.04 cr |
‘అమరన్’ చిత్రానికి తెలుగులో రూ.4.45 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 3 రోజుల్లో ఈ చిత్రం రూ.6.04 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.1.04 కోట్ల ప్రాఫిట్స్ అందించింది. ఆదివారం కూడా అడ్వాన్స్ బుకింగ్స్ బాగున్నాయి. ఈరోజు కూడా మొదటి రోజు మాదిరి గట్టిగా కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.