Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

  • February 1, 2026 / 11:33 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

కొత్త కథలని ముఖ్యంగా హర్రర్ బ్యాక్ డ్రాప్లో రూపొందే కథలను ఆదరించడానికి టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. అందులో ఎలాంటి సందేహం లేదు. అలాంటి కథలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. అలాంటి కోవకి చెందిన సినిమానే ‘అమరావతికి ఆహ్వానం'(Amaravathiki Aahwanam). శివ కంఠమనేని, ధ‌న్య బాల‌కృష్ణ‌, ఎస్తేర్, సుప్రీత, హ‌రీష్ ప్ర‌ధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాలో అశోక్ కుమార్‌, భ‌ద్ర‌మ్‌, జెమిని సురేష్, నాగేంద్ర ప్రసాద్ వంటి సీనియర్ నటులు కూడా కీల‌క‌ పాత్ర‌లు పోషించారు.

Amaravathiki Aahwanam

జీవీకే ఈ చిత్రానికి దర్శకుడు. ముప్పా వెంక‌య్య చౌద‌రి నిర్మాణ సార‌థ్యంలో జి. రాంబాబు యాద‌వ్ స‌మ‌ర్పణ‌లో ‘లైట్ హౌస్ సినీ మ్యాజిక్’ బ్యాన‌ర్‌ పై కేఎస్ శంక‌ర్‌రావు, ఆర్ వెంక‌టేశ్వ‌ర రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ చిత్రం టీజర్ లాంచ్ వేడుక ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది. మురళీ మోహన్ చేతుల మీదుగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ రిలీజ్ అయ్యింది. సినిమా ఫిబ్రవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది ఈ సినిమా.

amaravathiki ahwanam teaser

ఈ వేడుకలో భాగంగా…

నటుడు అశోక్ కుమార్ మాట్లాడుతూ – ”నిర్మాత వెంకటేశ్వరరావు గారు స్వయానా మా బావగారు. ఆయన అడగటంతో నేను ఈ సినిమాలో నటించాను. నేను నటిస్తున్నప్పుడు తెలియలేదు గానీ ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తుంటే కంటెంట్ చాలా బాగుందని అనిపిస్తుంది. అన్నివర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా డైరెక్టర్ జీవీకేగారు ఈ సినిమాను రూపొందించారు. ‘అమరావతికి ఆహ్వానం’ సినిమా మా టీమ్ అందరికీ విజయాన్ని అందించాలి అని కోరుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.

నటుడు జెమినీ సురేష్ మాట్లాడుతూ – ‘అమరావతికి ఆహ్వానం’ చిత్రంలో నేను ఫ‌స్ట్‌టైమ్‌ ఒక‌ పిచ్చివాడి క్యారెక్టర్ చేశాను. ఆ క్యారెక్టర్ మీకు బాగా నచ్చుతుంది. ఫ్యామిలీ మూవీస్, ఎంటర్ టైన్ మెంట్ మూవీస్, హారర్ మూవీస్..ఈ మూడు జానర్ మూవీస్ కు ఎప్పుడూ ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది. మా ‘అమరావతికి ఆహ్వానం’ సినిమాని కూడా మీరంతా సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాం” అన్నారు.

నిర్మాత ప్రసన్నకుమార్ మాట్లాడుతూ…. ‘అమరావతికి ఆహ్వానం’ సినిమా టీజర్ చాలా బాగుంది. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకుల్ని అలరిస్తుంది. మూవీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్” అంటూ చెప్పారు.

నిర్మాత మురళీ మోహన్ మాట్లాడుతూ… ‘అమరావతికి ఆహ్వానం’ సినిమా టీజర్ చాలా బాగుంది. ఈ మూవీ కంటెంట్ చూస్తుంటే తప్పకుండా విజయం సాధిస్తుందనే భావన కలుగుతుంది. ఈ నిర్మాతలు గతంలో కూడా చిన్న బడ్జెట్ లో మంచి చిత్రాలు చేశారు. మా గురువు గారు దాసరి గారు చెప్పినట్లు చిన్న చిత్రాలే ఇండస్ట్రీకి ప్రాణం. కొత్త దర్శకుడిగైనా జీవీకే ప్రతిభావంతంగా సినిమాను చక్కగా తెరకెక్కించారు. టీజర్ తోనే భయం కలిగించారు. ఈ చిత్ర నిర్మాతలు వెంకటేశ్వరరావు గారు, శంకర్ రావు గారితో నాకు చాలాకాలంగా స్నేహం ఉంది. వాళ్లు మా రియల్ ఎస్టేట్ రంగానికి చెందినవారు. గతంలో తెలుగు సినిమా అంటే తెలుగు వారికి మాత్రమే పరిమితమయ్యేది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతుంది.’అమరావతికి ఆహ్వానం’ సినిమా కూడా ఆ స్థాయి విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అంటూ తెలిపారు.

ప్రొడ్యూసర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ – ”మాకు సినిమా ఇండస్ట్రీతో 30 ఏళ్లకు పైగా అనుబంధం ఉంది. సినిమాలు చేయాలంటే డబ్బులు కావాలని రియల్ ఎస్టేట్ మార్గాన్ని ఎంచుకున్నాం. అప్పుడే మురళీమోహన్ గారితో పరిచయం ఏర్పడింది. ఆయన రాష్ట్ర రియల్ ఎస్టేట్ అసోసియేషన్ కు ప్రెసిడెంట్ గా పనిచేశారు. రియల్ ఎస్టేట్ లో సంపాదనతో చిన్న బడ్జెట్ లో సినిమాలు చేద్దామని ముందుకొచ్చాం. మా సంస్థలో “అమరావతికి ఆహ్వానంష‌ ఆరవ సినిమా. మేము నిర్మించిన గత చిత్రాలన్నీ థియేట్రికల్ గానే రిలీజ్ చేశాం. భోజ్ పూరిలో ఒక సినిమా చేసి అక్కడ విడుదల చేశాం. హారర్ జానర్ లో అందరికీ నచ్చేలా మా సినిమాను నిర్మించాం. ఫిబ్రవరి 13న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం. మీ అందరి సపోర్ట్ మా మూవీకి ఉంటుందని నమ్ముతున్నాం” అన్నారు.

హీరోయిన్ ఎస్తేర్ మాట్లాడుతూ – ‘అమరావతికి ఆహ్వానం’ సినిమా టీజర్ చూస్తున్నప్పుడు అందులోని యాక్టర్స్ అంతా నిజంగానే ఒక ఫ్యామిలీ కావొచ్చనే ఫీలింగ్ మీకు ఎలా కలిగిందో షూటింగ్ చేసేప్పుడు మా యూనిట్ అందరం ఒక ఫ్యామిలీ అనే భావన మా అందరిలో కలిగింది. అంతమంచి వాతావరణంలో పనిచేసిన మా అందరికీ ఇలాంటి మేకర్స్ కు సక్సెస్ రావాలనే అనిపిస్తుంది కదా. ఈ సినిమా మా ప్రొడ్యూసర్స్ కు సక్సెస్, డబ్బును తీసుకురావాలని కోరుకుంటున్నా. మా డైరెక్టర్ కు సినిమా మీదున్న ప్యాషన్, ఆయన స్క్రిప్ట్ నెరేట్ చేసేప్పుడే తెలిసింది. హారర్ ఎలిమెంట్స్ తో పాటు మీకు నచ్చే అన్ని కమర్షియల్ అంశాలతో ఈ సినిమా ఆకట్టుకుంటుంది” అన్నారు.

డైరెక్టర్ జీవీకే మాట్లాడుతూ – ”ప్రొడ్యూసర్ శంకర్ రావు గారి ప్రోత్సాహంతో ఈ సినిమాను రూపొందించాను. ఆయన మేము గతంలో ఓ మూవీ చేసినప్పుడు నేను ప్రొడ్యూస్ చేస్తాను నువ్వు కథ రెడీ చేసుకో అన్నారు. అలా ఈ ప్రాజెక్ట్ మొదలైంది. అనుకున్న బడ్జెట్ లో అనుకున్న షెడ్యూల్స్ ప్రకారం ప్లాన్డ్ గా ఈ సినిమా చేసుకుంటూ వచ్చాం. వీఎఫ్ఎక్స్ దగ్గరే మాకు కొంచెం డిలే అయ్యింది. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ ఎంతో సపోర్ట్ చేశారు. ఈ సినిమా నిర్మాతలకు, యూనిట్‌ సభ్యులకు, సపోర్ట్‌ చేసిన అందరికీ ధన్యవాదాలు.. ప్రేక్షకులు ఫలానా సినిమానే చూడాలని ఫిక్స్ అయి ఉండరు. వాళ్లకు కంటెంట్ నచ్చితే ఏ సినిమా అయినా చూస్తారు. మా మూవీ మంచి కంటెంట్ తో వస్తోంది. మా సినిమాకు మీ అంద‌రి సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నా” అన్నారు.

హీరో శివ కంఠమనేని మాట్లాడుతూ – ”మేము కలిసి గతంలో ‘అక్కడొకడుంటాడు, మధురపూడి గ్రామం అనే నేను, రాఘవరెడ్డి, బిగ్ బ్రదర్’ వంటి మూవీస్ చేశాం. ఇప్పుడు “అమరావతికి ఆహ్వానం” చిత్రంతో మీ ముందుకు వస్తున్నాం. ఈ మధ్య మెగాస్టార్ చిరంజీవి గారు అన్నట్లు సినిమా అనుకున్న బడ్జెట్ లో చేయడమే సగం సక్సెస్. అలా మా సినిమాను కూడా డైరెక్టర్ జీవీకే ఎక్కడా వృథా లేకుండా అనుకున్న బడ్జెట్ లో ఇన్ టైమ్ లో కంప్లీట్ చేశాడు. మా సినిమాలో ఎస్తేర్, ధన్య, సుప్రియ దెయ్యాల పాత్రల్లో భయపెడతారు. ఎస్తేర్ పెర్ఫార్మెన్స్‌ మంచి హైలైట్ అవుతుంది. సంక్రాంతికి వచ్చిన సినిమాలు ఎలా సక్సెస్ అయ్యాయో, అలాగే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో వచ్చే సినిమాలు, మాతో పాటు 13న రిలీజ్ అయ్యే సినిమాలన్నీ విజయం సాధించాలని కోరుకుంటున్నా” అన్నారు.

మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amaravathiki Aahwanam
  • #Amaravathiki Aahwanam teaser
  • #dhanya balakrishna
  • #ester
  • #Supritha

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

3 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

1 day ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

24 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

1 day ago
Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

2 days ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

2 days ago
Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version