బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు అమర్ ఒకరు. ఈయన బుల్లితెర నటుడిగా పలు సీరియల్స్ లో నటించి పెద్ద ఎత్తున ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్నారు. ఇలా బుల్లితెర నటుడిగా గుర్తింపు పొందినటువంటి అమర్ బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈయన సినిమాలకు కూడా కమిట్ అవుతున్నారు. గురువారం ఈయన తన మొదటి సినిమా పూజా కార్యక్రమాలను హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ఎంతో ఘనంగా నిర్వహించారు.
ఈ పూజా కార్యక్రమాల అనంతరం అమర్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. M3 మీడియా బ్యానర్లో మహేంద్ర నాథ్ కొండ్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాల్యాద్రి రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. బలగం రూపశ్రీ, రాజా రవీంద్ర, వినోద్ కుమార్, ఎస్తేర్, సురేఖా వాణి తదితరులు నటిస్తున్నారు.
ఈ పూజా కార్యక్రమాల అనంతరం అమర్ మాట్లాడుతూ ఈ సినిమా నేను బిగ్ బాస్ వెళ్లి వచ్చిన తర్వాత కమిట్ అయిన సినిమా కాదని తెలిపారు. బిగ్ బాస్ కంటే ముందుగానే ఈ సినిమా కథ విని సినిమా అగ్రిమెంట్ పై సైన్ చేసి మరి తాను బిగ్ బాస్ కార్యక్రమంలోకి వెళ్లానని తెలిపారు. మాల్యా నాకోసం ఎప్పటినుంచో ఒక కథను సిద్ధం చేసి పెట్టుకున్నారు. నాకోసం ఎన్నో ఏళ్లుగా వెయిట్ చేస్తున్నారు. నా గురించి తెలిసి..
నా కోసం ఈ పాత్రను డిజైన్ చేశారని అమర్ తెలిపారు. ఇక నేను సురేఖ వాణి గారిని ఇప్పటివరకు మేడం అంటూనే పిలిచాను మొదటిసారి తనని అక్క అని పిలుస్తున్నానని అక్క కూతురుతో నా మొదటి సినిమా చేస్తున్నాను అంటూ అమర్ తెలిపారు. ఇలా నా మొదటి సినిమాకు మీ అందరి ఆశీర్వాదం కావాలి అంటూ (Amardeep) ఈయన ఈ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.