విశేషదారణ దక్కించుకుంటున్న ‘ఏజెంట్ ఆనంద్ సంతోష్’ సంతోష్..!

తెలుగు ప్రేక్షకులను విభిన్న పద్ధతిలో ఆకట్టుకుంటూ వారికి ఎంటర్టైన్మెంట్ ని ప్రొవైడ్ చేయడంలో ‘ఆహా’ సంస్థ విజయవంతంగా దూసుకుపోతుంది.ఇప్పుడు అన్ని ఓటీటీ ల కంటే ఎక్కువ కంటెంట్ ను మరియు బెస్ట్ కంటెంట్ ను ప్రేక్షకులకు అందిస్తుంది. ‘సామ్ జామ్’ ‘అన్ స్టాపబుల్’ వంటి టాక్ షోలతో పాటు ఇండియన్ ఐడల్ తెలుగు వంటి సింగింగ్ షోని కూడా ప్రారంభించి మరింతగా ప్రేక్షకులకు దగ్గరైంది. ‘ఆహా’ ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా బాగా దగ్గరైంది.

పలు కొత్త సినిమాలను హై క్వాలిటీ వెర్షన్ల తో స్ట్రీమింగ్ చేస్తూనే ఒరిజినల్ మూవీస్ ను, వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ వారం వారం ప్రేక్షకులను కట్టిపారేస్తుంది.తాజాగా ‘ఆహా’ వారి నుండి రాబోతున్న కొత్త సిరీస్ ‘ఏజెంట్ ఆనంద్ సంతోష్’. ‘బిగ్ బాస్ 5’ రన్నర్ షణ్ముఖ్ జస్వంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సిరీస్ ఇది. తాజాగా ‘ఏజెంట్ ఆనంద్ సంతోష్’ టీజర్ రిలీజ్ అవ్వగా దానికి మంచి రెస్పాన్స్ లభిస్తుంది.

‘నువ్వు ఏం చేస్తుంటావ్? ఎంత సంపాదిస్తుంటావ్? పోనీ నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత?’ అంటూ ప్రశ్నిస్తే ‘మనసు తప్ప తప్పిపోయిన మనుషులను, సామాన్లను వెతికి పెడుతూ ఉంటాను’ బదులిస్తున్నాడు షణ్ముఖ్. ఈ టీజర్ ను బట్టి..’ఏజెంట్ ఆనంద్ సంతోష్’ ఎంటర్టైన్మెంట్ ను ఇవ్వడం గ్యారెంటీ అని క్లారిటీ ఇచ్చేశారు. అరుణ్ పవార్ ఈ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలోనే ఆహాలో స్ట్రీమింగ్ కానుంది ఈ సిరీస్.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus