ఫేడౌట్ అయ్యి 20 ఏళ్ళు అవుతున్నా.. హిట్టు కొట్టింది..గ్రేటే!

  • August 18, 2023 / 06:06 AM IST

హీరోయిన్లకి లైఫ్ టైం చాలా తక్కువ. గట్టిగా ఉంటే.. 10 ఏళ్ళు. అలాంటిది 20 ఏళ్ళ క్రితమే ఫేడౌట్ అయిపోయినప్పటికీ.. తాజాగా ఓ సూపర్ హిట్ అందుకుంది ఓ హీరోయిన్. ఆమె మరెవరో కాదు అమీషా పటేల్..! ఈమెను జనం మర్చిపోయి చాలా కాలం అవుతుంది. 20 ఏళ్ల క్రితం ఈమె ‘కహో నా ప్యార్ హై’, ‘గదర్ ఏక్ ప్రేమ్ కథ’, ‘బద్రి’ వంటి హిట్ సినిమాల్లో నటించింది. ఆ తర్వాత ఈమె నటించిన ‘నాని’ ‘నరసింహుడు’ ‘పరమవీరచక్ర’ వంటి సినిమాలు అన్నీ ప్లాపులే.

హిందీలో కూడా ఈమె నటించిన సినిమాలు అన్నీ ఫ్లాప్ అయ్యాయి. ప్రస్తుతం అమీషా పటేల్ వయసు 47 ఏళ్ళు. అయినప్పటికీ ‘గదర్ 2’ లో ఆమెను తీసుకున్నారు. ఎప్పుడో ఫేడౌట్ అయిపోయిన సన్నీ డియోల్ ఈ సినిమాలో హీరో. ఆగస్టు 11న రిలీజ్ అయిన ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. మొదటి రోజు ఈ సినిమా రూ.40 కోట్లు పైనే వసూల్ చేసింది. ఇప్పటికి రూ.225 కోట్ల వరకు వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించింది.

అమీషా పటేల్ ఖాతాలో ఓ సాలిడ్ హిట్ పడినట్టు అయ్యింది. అమీషా పటేల్ కి ఎక్కువగా అవకాశాలు రాక.. సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటో షూట్లలో పాల్గొంటూ వస్తున్న ఆమెకు.. అదీ 47 ఏళ్ళ వయసులో హీరోయిన్ గా ఓ సక్సెస్ కొట్టడం అంటే మాటలు కాదు. మరి ఇక నుండి ఆమె ఎలాంటి ప్రాజెక్టులు ఎంపిక చేసుకుంటుంది? ‘గదర్ 2 ‘ సక్సెస్ ను ఆమె క్యాష్ చేసుకుంటుందా లేదా అనేది చూడాలి.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus