ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ వరల్డ్ మూవీ ‘ప్రాజెక్ట్ కె’. ఈ సినిమాలో బిగ్ బీ అమితాబచ్చన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన షూటింగ్ లో గాయాల పాలైనట్లు తెలుస్తోంది .అవును ప్రాజెక్ట్ కె షూటింగ్ లో పాల్గొంటున్న టైంలో అమితాబ్ గాయపడ్డారు ఈ విషయాన్ని స్వయంగా అమితాబ్ తెలియజేసినట్టు సమాచారం. దీంతో అమితాబ్ ను హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు.
ఈ క్రమంలో వైద్యులు ఆయన్ని రెండు, మూడు వారాలు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిందిగా కోరారట. అందుకే ఆయన తిరిగి ముంబై వెళ్లినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ముంబైలో ఉన్న అమితాబ్…. ‘కొన్ని రోజుల పాటు అభిమానుల్ని కలవలేను, షూటింగులు కూడా రద్దు చేసుకొన్నాను. ‘ప్రాజెక్ట్ కె’ షూటింగ్‌లో యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొంటున్న టైంలో గాయాల పాలయ్యాను. పట్టెటెముకులకు దెబ్బ తగిలింది. వెంటనే షూటింగ్ రద్దు చేసుకొని హైదరాబాద్ లోని ఏఎంజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకొన్నాను.
ఊపిరి తీసుకొంటున్నప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే ముంబైలోని నా ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకొంటున్నాను” అంటూ తన బ్లాగ్ లో రాసుకొచ్చారు అమితాబ్ బచ్చన్. దీంతో ‘ప్రాజెక్ట్ కె’ తో పాటు అమితాబ్ నటిస్తున్న సినిమాల షూటింగ్లు వాయిదా పడ్డాయి. ఇక ప్రాజెక్ట్ కె చిత్రాన్ని ‘వైజయంతీ మూవీస్’ బ్యానర్ పై సి.అశ్వినీదత్ నిర్మిస్తున్నారు.
దీపికా పదుకోనె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో దిశా పటాని కూడా కీలక పాత్ర పోషిస్తుంది. 70 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ.. మరోపక్క వి.ఎఫ్.ఎక్స్ వర్క్ ను కూడా జరుపుకుంటుంది. సంతోష్ నారాయణ్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.
ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!
స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!