Amitabh Bachchan: అమితాబ్ కి మరోసారి కోవిడ్ పాజిటివ్!

  • August 24, 2022 / 01:37 PM IST

కరోనా వైరస్ ఇప్పటికీ జనాలను ఇబ్బంది పెడుతూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు చాలా మంది కరోనా బారిన పడుతూనే ఉన్నారు. తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కరోనా బారిన పడ్డారు. దీంతో ఆయన్ను హాస్పిటల్ లో జాయిన్ చేశారు. డాక్టర్స్ పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని.. ఈ మధ్యకాలంలో తనను కలిసినవారు కరోనా టెస్ట్ చేయించుకోమని సూచించారు అమితాబ్.

బిగ్ బీకి కరోనా సోకడం పట్ల ఆయన అభిమానులతో పాటు సినీ పరిశ్రమకు చెందిన వారు కూడా ఆందోళనకు గురయ్యారు. అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు. అమితాబ్ కి కరోనా సోకడం ఇది రెండోసారి. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో ఆయనకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఆ సమయంలో కూడా ఆయన్ను హాస్పిటల్ లో చేర్చి ట్రీట్మెంట్ అందించారు. అప్పుడు అమితాబ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకింది.

మెల్లగా అందరూ కోలుకున్నారు. ఇప్పుడు అమితాబ్ కి మరోసారి కరోనా రావడంతో ఫ్యామిలీ మెంబర్స్ టెన్షన్ పడుతున్నారు. ఇక అమితాబ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన హోస్ట్ గా ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ అనే షో నడుస్తోంది. అలానే త్వరలోనే విడుదల కానున్న ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో కీలకపాత్ర పోషించారు అమితాబ్. ఇటీవల ‘కార్తికేయ2’ దర్శకుడు చందు మొండేటిని బిగ్ బి ప్రశంసించిన సంగతి తెలిసిందే. తన ఇంటికి పిలిచి మరీ ‘కార్తికేయ2’ టీమ్ ని సత్కరించారు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus