Amma Rajasekhar: గోపీచంద్ పై అమ్మ రాజశేఖర్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

ప్రముఖ టాలీవుడ్ దర్శకులలో ఒకరైన అమ్మ రాజశేఖర్ ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేక కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇదే సమయంలో పలువురు హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేయడం ద్వారా ఆయన వార్తల్లో నిలుస్తున్నారు. కొన్నిరోజుల క్రితం నితిన్ పై ఆరోపణలు చేసిన అమ్మ రాజశేఖర్ తాజాగా గోపీచంద్ పై కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గోపీచంద్ తో నేను రణం సినిమాను తెరకెక్కించి సక్సెస్ సాధించానని

ఆ సినిమా సమయంలోనే గోపీచంద్ నాతో మరో సినిమా చేద్దామని చెప్పారని అమ్మ రాజశేఖర్ చెప్పుకొచ్చారు. ఆ సమయంలో మరో మూవీ కోసం గోపీచంద్ కు తాను లైన్ చెప్పానని అమ్మ రాజశేఖర్ పేర్కొన్నారు. నేను చెప్పిన లైన్ నచ్చడంతో సినిమా చేద్దామని గోపీచంద్ మాట ఇచ్చారని అమ్మ రాజశేఖర్ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత నాకు సురేష్ ప్రొడక్షన్స్ నుంచి పిలుపు రావడంతో పాటు అడ్వాన్స్ ఇచ్చారని అమ్మ రాజశేఖర్ అన్నారు.

వెంకటేష్ గారితో మూవీ చేసే ఛాన్స్ దక్కగా స్పెషల్ సెట్ కూడా వేయించారని అమ్మ రాజశేఖర్ చెప్పుకొచ్చారు. సినిమా షూటింగ్ మొదలుపెట్టాలని అనుకున్న సమయంలో శంఖం మూవీ విడుదలైందని అమ్మ రాజశేఖర్ పేర్కొన్నారు. గోపీచంద్ కు నేను చెప్పిన లైన్ తోనే శంఖం మూవీ తెరకెక్కడంతో షాకయ్యానని ఆయన అన్నారు. గోపీచంద్ కు చెప్పిన లైన్ తో వెంకటేష్ తో సినిమా తెరకెక్కించాలని భావించగా సురేష్ బాబు కూడా ఆ కథ వద్దని మరో కథతో మూవీ చేద్దామని చెప్పారని అమ్మ రాజశేఖర్ వెల్లడించారు.

ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ సెట్ కాకపోవడంతో చాలా ఏడ్చానని అమ్మ రాజశేఖర్ అన్నారు. ఈ విధంగా గోపీచంద్ నన్ను మోసం చేశాడని ఆయన అన్నారు. అమ్మ రాజశేఖర్ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సాధారణంగా గోపీచంద్ వివాదాలకు దూరంగా ఉంటారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. అమ్మ రాజశేఖర్ కామెంట్లపై గోపీచంద్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus