డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!

  • July 14, 2022 / 03:13 PM IST

పెద్ద హీరోల సినిమాలు ప్లాప్ అయినా.. వారం రోజులు నిలబడితే చాలు కలెక్షన్లు వచ్చేస్తాయి అంటుంటారు. ఇది చాలా వరకు నిజమే..! నిర్మాతలు సేఫ్ అవుతారు కానీ డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతుంటారు. ఉదాహరణకి ఓ సినిమాని దర్శకనిర్మాతలు రూ.100 కోట్ల బడ్జెట్ లో తీస్తే.. ఆ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలోనే 50 శాతం అంటే రూ.50 కోట్ల వరకు వెనక్కి రాబట్టేస్తుంది. కాబట్టి థియేట్రికల్ రైట్స్ పరంగా ఆ మూవీ సేఫ్ అవ్వడానికి రూ.50 కోట్లు కలెక్ట్ చేస్తే చాలు సినిమా హిట్ అయినట్టే. కానీ బయ్యర్స్ ఎక్కువ రేట్లు పెట్టి కొనుగోలు చేయడం వలన.. అంటే రూ.50 కోట్ల సినిమాని రూ.70 కోట్లు, రూ.100 కోట్లు పెట్టి కొనుగోలు చేస్తే.. అప్పుడు వారు నష్టపోతూ ఉంటారు.

కొన్ని సినిమాలకు ‘రాడ్డు రంబోలా’ అనే టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద బాగానే కలెక్ట్ చేశాయి. ఆ సినిమాల కలెక్షన్స్ ను చూస్తే ఎవ్వరైనా షాక్ తినాల్సిందే. కేవలం హీరోల మార్కెట్ వలన ఆ సినిమాలు మేకింగ్ పరంగా పర్వాలేదు అనిపిస్తాయేమో అని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతుంటారు. ఆ ఘోరమైన సినిమాలు ఏంటో.. అవి కలెక్ట్ చేసిన ఘనమైన కలెక్షన్లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) సాహో :

ప్రభాస్ నటించిన ఈ మూవీ మొదటి షో తోనే డిజాస్టర్ టాక్ ను మూటకట్టుకుంది. అయినా సరే ‘బాహుబలి’ క్రేజ్ కలిసి రావడంతో రూ.160 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఇది తెలుగు వెర్షన్ కు మాత్రమే. అదే అన్ని వెర్షన్లు కలుపుకుని అయితే రూ.400 కోట్ల గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేసింది.

2) రాధే శ్యామ్ :

ప్రభాస్ నటించిన ఈ మూవీ ఈ ఏడాది మార్చి లో రిలీజ్ అయ్యింది. తొలి షోతోనే నెగిటివ్ టాక్ ను మూటకట్టుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.150 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

3) స్పైడర్ :

మహేష్ బాబు కెరీర్లో బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ ఇది. మొదటి షోతోనే డిజాస్టర్ టాక్ ను మూటకట్టుకుంది. ఇది మహేష్ ఇమేజ్ కు ఏమాత్రం సూట్ అయ్యే సినిమా కాదు. అయినా సరే బాక్సాఫీస్ వద్ద అన్ని వెర్షన్లు కలుపుకుని ఈ మూవీ రూ.100 కోట్లకి కొంచెం ఎక్కువగానే గ్రాస్ కలెక్షన్ రాబట్టి ట్రేడ్ కు సైతం షాక్ ఇచ్చింది.

4) అజ్ఞాతవాసి :

ఇది ‘స్పైడర్’ ను మించిన డిజాస్టర్. కానీ పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ ల ఇమేజ్.. అలాగే సంక్రాంతి సీజన్ కలిసి రావడంతో రూ.95 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

5) సర్దార్ గబ్బర్ సింగ్ :

పవన్ కళ్యాణ్ కెరీర్లో బిగ్గెస్ట్ ప్లాప్స్ లో ఒకటిగా నిలిచిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.92 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టి అందరికీ షాకిచ్చింది.

6) వినయ విధేయ రామ :

రాంచరణ్ హీరోగా నటించిన ఈ మూవీ డిజాస్టర్ టాక్ ను మూటకట్టుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద రూ.91 కోట్ల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది.

7) కాటమరాయుడు :

ఆల్రెడీ ‘వీరుడొక్కడే’ అంటూ తెలుగులో డబ్ అయిన ఓ మూవీకి రీమేక్ ఇది. సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కేవలం పవన్ కళ్యాణ్ వల్ల టికెట్లు చిరిగాయి. ఫుల్ రన్లో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.89 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది.

8) నా పేరు సూర్య :

అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ మొదటి షోతోనే ప్లాప్ టాక్ ను మూటకట్టుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రూ.87 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టి అందరికీ షాకిచ్చింది.

9) బ్రహ్మోత్సవం :

ఈ సినిమాని మహేష్ బాబు అభిమానులు కూడా థియేటర్లో ఒక్కసారి చూడ్డానికి చాలా కష్టపడి ఉంటారు. అయినా సరే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫుల్ రన్లో రూ.81 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది.

10) ఆచార్య :

మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం డిజాస్టర్ అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద రూ.78 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus