ప్రతి వారం ఓ కొత్త టాపిక్ తో ఎంటర్టైన్ చేస్తూ.. అవేర్నెస్ కలిగిస్తున్న”మహాతల్లి” ఈసారి “అమ్మాయిల షాపింగ్ గోల” తో మనముందుకు వచ్చేసింది. గర్ల్స్ షాపింగ్ సమయంలో ఆలోచించే విధానం ఎలా ఉంటుందో తమాషా గా చూపించింది. గత క్యూట్ ఫిల్మ్ ల కంటే .. అంతకు మించి వినోదాన్ని పంచింది.
స్పెషల్ ఏమిటంటే..
“అబ్బాయిల మందు సిట్టింగ్.. అమ్మాయిల షాపింగ్ .. 2 మినిట్స్.. 10 మినిట్స్ లో అయినట్లు చరిత్రలో లేదు..” అంటూ రజనీ కాంత్ రేంజ్ లో జాహ్నవి డైలాగ్ చెప్పి షాపింగ్ మాల్లోకి మనల్ని తీసుకెళుతుంది. అక్కడ డ్రస్సులను చూడగానే నచ్చి ఉత్సాహం… ట్రైల్ వేసుకుని చూస్తే నప్పక నిరూత్సాహం. డిజైన్ బాగుండి సరిగ్గా సూటైతే ధర అందుబాటులో లేకపోవడం. ఎన్నో కొనాలని ఆశ పడి సెలక్ట్ చేసుకోవడం..
బడ్జెట్ సరిపోక ఒక్క పెయిర్ తో బయటకు రావడం… ఈ సీన్లలో సీరియస్ గా నటిస్తూ కామెడీ తెప్పించింది. వీటి మధ్యలో మహా తల్లి మరో పంచ్ డైలాగ్ వేసింది. “బాయ్ ఫ్రెండ్ గురించి పేరెంట్స్ దగ్గర అప్రూవల్ తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో.. డ్రెస్ కొనుక్కునేటప్పుడు బెస్ట్ ఫ్రెండ్ దగ్గర అప్రూవల్ తీసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ ..” అంటూ నిజాలను పవన్ కళ్యాణ్ స్టైల్లో పవర్ ఫుల్ గా చెప్పి ఆకట్టుకుంది. నాలుగు నిముషాల నిడివిగల బుజ్జి చిత్రంతో బోలెడంత ఫన్ పంచింది.